మందు బాబులు తస్మాత్ జాగ్రత్త…. కాలం చెల్లిన బీర్ల అమ్మకం

0
279

రాయికల్ తాజా కబురు: మండలంలోని అల్లీపూర్ శ్రీ లక్ష్మీ వైన్స్ లో జగిత్యాల కు చెందిన ఓ వ్యక్తి ఆదివారం బెక్స్ఐస్ బీర్ ను కొనుగోలు చేయగా కాలం చెల్లిన బీర్ సీసాను అమ్మినట్లు గుర్తించి యాజమాన్యం కు చూపించగా అట్టి బీరు కు బదులుగా వేరే కంపెనీకి చెందిన బీరు ఇస్తామని ఈ విషయంను ఎవరికి తెలుపవద్దని సదరు వ్యక్తిని కోరినట్లు మా ప్రతినిధికి సంబంధిత కొనుగోలు దారు సమాచారం తెలిపారు.

కాగా కాలం చెల్లిన బీర్లు అమ్ముతున్న సదరు వైన్స్ దుకాణం పై ఎక్సైజ్ అధికారులు
చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఏది ఏమైనా లాక్ డౌన్ వల్ల బీర్ల అమ్మకాలు నిలిపివేయడంతో బీర్లు కొనుగోలు చేసే ముందు నిర్ణిత తేదీని చూసి కొనుగోలు చేయాలని, సంబంధింత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించకపోతే కాలం చెల్లిన బీర్లు తాగడం వల్ల ప్రాణాలతో చెలగాటం ఆడినట్లు అవుతుందని ముప్పు తప్పదని సామాజిక వేత్తలు హెచ్చరిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here