మంత్రి కేటీఆర్ కు ట్వీట్..ఎమ్మెల్యే చొరవతో రెండు లక్షల ఎల్వోసి అందజేత

0
230

రాయికల్ తాజా కబురు: మండలంలోని భూపతిపుర్ గ్రామానికి చెందిన భూపతి-ప్రశాంతి దంపతులకు ఇద్దరు కవలలు జన్మించారు. కాగా పిల్లలిద్దరు బరువు తక్కువగా ఉండటంతో వైద్య ఖర్చులు లక్షల్లో కావటంతో ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు తెలిపారు..ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు సైతం ఫోన్ ద్వారా తెలపగా మంత్రి కేటీఆర్ తో ఫోన్ లో మాట్లాడిన సంజయ్ కుమార్ వైద్యఖర్చుల నిమిత్తం రెండు లక్షల ఎల్వోసి ని సోమవారం అందజేశారు.వైద్యం పొందుతున్న జగిత్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యునితో సైతం మాట్లాడిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ మెరుగైన వైద్యం అందించాలని కోరారు.వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ కు,అండగా నిలిచిన ఎమ్మెల్యే కు కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.చెక్కు ను అందిచేపుడు వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, సర్పంచ్ జక్కుల చంద్రశేఖర్, జక్కుల రంజిత్ లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here