మండల అధికారులతో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సమీక్ష సమావేశం

0
51
Dava vasantha samiksha

జగిత్యాల తాజా కబురు: జిల్లా పరిషత్ క్యాంప్ కార్యాలయంలో గ్రామీణ,పట్టణ మండలాల ఎంపీడీఓలతో మంగళవారం జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మళ్ళీ విజృంభిస్తున సందర్భంగా ప్రతి గ్రామంలో శానిటేషన్ చేయాలని అధికారులకు సూచించారు. వేసవి కాలంలో గ్రామాల్లో మొక్కలు ఎండిపోకుండా ఉదయం,సాయంత్రం రెండు సార్లు నీరు పట్టే విధంగా ఏర్పాట్లు చేయాలనీ, గ్రామాల్లో మిగిలిన వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీడీఓ రాజేశ్వరి, అర్బన్ ఇంచార్జి ఎంపీడీఓ గంగాధర్ ఎంపీఓలు శ్రీనివాస్ రెడ్డి, సలీమ్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here