భూపతిపూర్,ఇటిక్యాల గ్రామాలలో రైతు వేదికలను ప్రారంభించిన ఎమ్మెల్యే :: డా.సంజయ్ కుమార్

0
59

జగిత్యాల తాజా కబురు: రాయిక‌ల్ మండ‌లం భూప‌తిపూర్,ఇటిక్యాల గ్రామాల్లో నిర్మించిన రైతు వేదిక‌ల‌తో పాటు ప‌ల్లె ప్రకృతివనాలు,డంపింగ్ యార్డు,వైకుంఠ‌దామాలను ఎమ్మెల్యే డా.సంజ‌య్ కుమార్ బుధవారం ప్రారంభించారు.ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల ప‌క్ష‌పాతిగా ఉన్న తెలంగాణ ప్ర‌భుత్వం రైత‌న్న‌ల కోసం చ‌ర్చా వేదిక తో పాటు నిత్యం వ్య‌వ‌సాయ‌రంగంలో వ‌స్తున్న మార్పులు,పంట‌ల ధ‌ర‌లు యావ‌త్ తెలంగాణ రైతుల‌కు అందుబాటులో ఉండాల‌న్న ఉద్దేశ్యంతో రైతు వేదిక‌లు నిర్మించుకున్నామ‌ని,ఈ వేదిక‌లు అధ్య‌య‌న కేంద్రాలుగా మార‌నున్నాయ‌ని అన్నారు.కోటి ఎక‌రాల మాగాణే ల‌క్ష్యంగా నేడు కోటి 40 ల‌క్ష‌ల వ‌రిధాన్యాన్ని రికార్డుస్దాయిలో పండిస్తున్నామ‌న్నారు.పండించిన పంట‌ను ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తూ రైతుల‌కు ఇబ్బంది లేకుండా చేస్తోంద‌న్నారు.ప్ర‌తి 5 వేల ఎక‌రాల‌కు వ్య‌వ‌సాయధికారిని నియ‌మించి స‌ల‌హాలు,సూచ‌న‌ల‌తో పాటు స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహన క‌ల్పిస్తోంద‌న్నారు.రైతులు భూసార ప‌రిక్ష‌ల కోసం వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం పొలాస లో 42 ల‌క్ష‌ల విలువ‌గ‌ల‌ అధునాత‌న యంత్రం అందుబాటులో ఉంద‌ని రైతులు భూసార ప‌రిక్ష‌లు చేసుకోవాల‌ని కోరారు.ఫ‌లితంగా అనువైన పంట‌లు వేసుకునేందుకు ఈ ప‌రిక్ష‌లు దోహ‌ద‌ప‌డుతాయ‌న్నారు.నేడు గ్రామ‌గ్రామ‌న పల్లె ప్రకృతివనాలు ఏర్పాటుచేసుకున్నామ‌ని ఫ‌లితంగా ప్ర‌తి గ్రామంలో మినిపార్క్ ఏర్పాట‌య్యింద‌ని గ్రామ‌స్దులంతా భాద్య‌త‌గా మొక్క‌లు నాట‌డంతో పాటు సంరక్షించుకోవాల‌ని కోరారు.ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని కోరారు.అఖ‌రి మ‌జిలీకి ఆటంకాలు లేకుండా గ్రామ‌గ్రామ‌న వైకుంఠ‌ధామాలు ఏర్పాటు చేసింద‌ని అన్నారు..భూపతిపూర్ గ్రామంలో నూతన అంబేద్కర్ విగ్రహాన్నీ ఆవిష్కరించి మాట్లాడుతూ నేటి యువత ప్రపంచ మేధావి భారతదేశ ‌ దార్శనికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు.నేటి రాజకీయ ఉద్యోగ రంగాల్లో లో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉండే విధంగా రాజ్యాంగ ఫలాలను అన్ని వర్గాలకు అందించిన గొప్ప దార్శనికుడు అని కొనియాడారు.
అనంతరం భూపతిపూర్ గ్రామంలో ఇటీవల ఎల్లల మోహన్ రెడ్డి అనారోగ్యంతో మరణించగా వారికుటుంబ సభ్యులకు 5 లక్షల రైతు భీమా అందజేసారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వర్,ఎంపిడిఓ రమేష్, ఎంపీఓ శ్రీనివాస్,ఎంపీపీ లావుడియా సంధ్యా రాణి సురేందర్, జెడ్ .పి.టి.సి జాదవ్ అశ్విని, ఆయా గ్రామాల సర్పంచ్ లు జక్కుల చంద్రశేఖర్, సమాల్ల లావణ్య వేణు, వైస్ ఎంపీపీ వై మహేశ్వర్ రావు, ఉప సర్పంచ్ అన్నవేణి వేణు,పిఎసిఎస్ చైర్మన్ ఏనుగు ముత్యం రెడ్డి,అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముద్దం ప్రకాష్,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయుకులు పేట భాస్కర్, బిరుదుల లక్ష్మణ్,చెంగలి గంగాధర్, కొమ్ము దిలీప్ కుమార్, బొల్లె చిన్నయ్య, రౌట్ల కిష్టయ్య, కేజీ రామ్, బొల్లె గంగాధర్, కాయితి మురళి, బొల్లె గంగారం, కంటే నారాయణ, బొల్లె విజయ్,మండల భూపతి , కొమ్ము నిరంజన్ , మండల ప్రవీణ్,రౌట్ల లక్ష్మణ్,నలువాల గంగారం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here