భార్యకు కరోనా… రాఘవ్ పేట్ లో భర్త గుండెపోటుతో మృతి

0
110

కరోనా భయంతో దగ్గరకు రాని కుటుంబ సభ్యులు
సర్పంచ్,ఉప సర్పంచ్ చొరవతో అంత్యక్రియలు..

తాజా కబురు మల్లాపూర్: కరోనా స్రుష్టిస్తున్న విలయతాండంలో ఎందరో అసువులుబాసుతున్నారు కరోనా ఆడుతున్న వింతననాటకంలో విగతజీవులుగా మారుతున్నారు. భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆందోళన పడి భర్త గుండెపోటుతో మరణించిన సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో చోటు చేసుకుంది.
మల్లాపూర్ మండలంలోని రాఘవపేట గ్రామానికి చెందిన బేజ్జారపు పరమానందం భార్య జమున గత వారం రోజులుగా జ్వరం, దగ్గుతో బాధపడుతుండటంతో కరోనా అనుమానంతో మల్లాపూర్ లో ఈ నెల 30వ తేదీ నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా రాపిడ్ పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా వైద్యులు నిర్దారించారు, అదె సమయంలో పరమానందం కు పరిక్షలు చేస్తె నెగెటివ్ వచ్చింది, తన బార్యకు ఏమైన అవుతుందో అని కంగుతిని ఆదివారం రాత్రి గుండే పోటుతో బేజ్జారపు పరమానందం మరణించాడు. అతని అంత్యక్రియలు చెయ్యటానికి కుటుంబ సభ్యులు,బంధువులు ఎవరు ముందకు రాలేదు ఆయన శవం అనాధల రోడుపైనె పడి ఉండటంతో గ్రామ సర్పంచ్ సత్తి లావణ్య ఉప సర్పంచ్ అమీనోద్దీన్,తెరాస పార్టీ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్ వెంటనే ఎమ్మెల్యే విద్యా విద్యా సాగర్ రావు ద్వారా కోరుట్ల కు చెందిన ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి సంస్థ అనే స్వంచంద సంస్థ దృష్టికి తీసుకెళ్లగా వారి సహాయంతో సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామ యువకులు అంబులెన్స్ ద్వారా మృత దేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలను నిర్వహించడం జరిగింది..
అనంతరం తహసీల్దార్, సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు, యువకులు ఆల్ ఇండియా మానవత్వ సందేశ సమితి సంస్థ సభ్యులు నసిర్ అలీ,ఇసాక్, అబ్దుల్లా,సుఫ్యాల్,హాఫిజ్,అబ్దుల్ రబ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీరాముల సురేష్, నాయకులు బైరి రవికుమార్, డా.బొలిశెట్టి రమేష్, రమేష్,రమణ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here