భారత్ పై చైనా ప్రీ ప్లాన్ నా..?

0
99

తాజా కబురు హైదరాబాద్ డెస్క్: పాంగాంగ్ సరస్సు సమీపంలో దురాక్రమణకు యత్నించిన చైనా భారీ సంఖ్యలో బలగాలను సరిహద్దులో మోహరించింది. జే-20 యుద్ధ విమానాలను సైతం సరిహద్దులకు చేరువలో మోహరించింది.భారత్‌తో కయ్యానికి చైనా కాలు దువ్వుతోంది. గల్వాన్ ఘర్షణల తర్వాత ఉద్రిక్తతలు ఇంకా చల్లారక ముందే మరోసారి పాంగాంగ్ సరస్సు సమీపంలో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా బలగాలు ప్రయత్నించాయి. ఈ చర్యను భారత సైన్యం తిప్పి కొట్టింది. రెండోసారి కూడా చైనా పక్కా ప్లాన్‌తోనే ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చే ప్రయత్నం చేసిందని తెలుస్తోంది. ఆగస్టు 29వ తేదీ రాత్రి చైనా ఇందుకు ప్రయత్నించగా అంతకు కొద్ది రోజుల ముందే చైనీస్ ఎయిర్‌ఫోర్స్ జె-20 యుద్ధ విమానాలను భారత్ సమీపంలో మరోసారి మోహరించింది. ఈ విషయాన్ని భారత ఆర్మీ ఉన్నత వర్గాలు వెల్లడించాయి. ఎల్ఏసీ సమీపంలో ఇవి ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నట్లు సమాచారం.జె-20 ఐదో తరానికి చెందిన ఈ యుద్ధ విమానాలు జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని హోటన్ ఎయిర్‌బేస్‌లో నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచే వ్యూహాత్మక బాంబర్లు, ఇతర ఫైటర్ జెట్లను కూడా మోహరించినట్లు తెలుస్తోంది.

ఈ హోటన్ ఎయిర్‌బేస్ కారకోరం కనుమ 250 కి.మీ. దూరంలో, పాంగాంగ్ త్సో ఫింగర్ 4 ప్రాంతానికి 380 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇటీవలే రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో చేరిన నేపథ్యంలో.. చైనా తన అధునాతన ఫైటర్ జైట్లను భారత సరిహద్దులకు సమీపంలో మోహరించింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జిన్‌జియాంగ్, టిబెట్ ప్రాంతాల్లోని ఏడు చైనీస్ మిలిటరీ బేస్‌లపై భారత్ నిఘా పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here