భారతీయులకు మరో దీపావళి ఈరోజే…

0
95

తాజా కబురు రాయికల్: భారతీయుల, హిందువుల చిరకాల స్వప్నం, సుమారు గా గత 500 సంవత్సరాల నుండి కోటి కళ్లతో ఎదిరిచూస్తున్న కోరిక నెరుచున్న తరుణంలో శ్రీరాముని జన్మస్థాన మయిన అయోధ్యలో నేడు భారత ప్రధాని నరేంద్రమోదీ బుధవారం స్వయంగా హాజరై శ్రీరాముని భవ్య, దివ్య మందిరానికి భూమిపూజ చేసి గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకతో గుడి నిర్మాణాన్ని స్థాపించ నున్న శుభ సందర్భంగా యం.పి.టి.సి. ఆకుల మహేష్, బిజెపి నాయకులు అనుపురం సత్యంగౌడ్ ఆద్వర్యంలో రామాజీపేట్ శ్రీ రామాలయంలో శ్రీ సీతా రామచంద్ర స్వామి వారికి, అభిషేకాలు, అర్చలు, ప్రత్యేక పూజలు చేసి గుడి ఆవరణలో చెట్లను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ బిజేపితో, మోదీతోనే సాధ్యమని, అయోధ్యలో శ్రీరామ మందిరం మత సామరస్యానికి నిదర్శనమని అన్నారు. 500 సంవత్సరాల సమస్యపరిష్కారమై కళ నెరవేరుచున్న సందర్భంలో చెప్పలేనంత ఆనంద కలుగుతుందని, భారతీయులకు మరో దీపావళి ఈ రోజే నని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జకిలేటి హరీష్ రావ్, ఆర్,ఎస్,ఎస్, బిజెపి బాధ్యులు అనుపురం సత్యం గౌడ్, నేతలు తిరుపతి యాదవ్, కోల శంకర్, జుంబర్తి నరేందర్, అనుపురం ఆనంద్ గౌడ్, మూడపెల్లి రమేష్, రిటైర్డ్ ఏఈ వెంకట రమణారావు, కళ్లెడ భీమరాజు, గూడూరి రాజేందర్, పంతులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here