బ్రాహ్మణ సేవ పరిషత్ ఆధ్వర్యంలో అన్న వితరణ

0
319

కోరుట్ల తాజా కబురు: కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలకు తమ వంతుగా సాయం అందించేందుకు పట్టణంలోని బ్రాహ్మణ సేవా పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య అనిల్, కమిషనర్ అయాజ్ అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని దాదాపు 800 మందికి అన్న వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బ్రహ్మన్న గారి శంకర్ శర్మ, ప్రవీణ్ కుమార్ శర్మ, పాలెపు రాము శర్మ, రమేష్, దివాకర్, భానుమూర్తి, ప్రదీప్, శ్రీధర్, ఫణీంద్ర, సత్యనారాయణ, స్వరాజ్, శ్రీనివాసమూర్తి, నరసింహమూర్తి, చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here