బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం నిజమేనా…?

0
399

విచారణ చేపట్టిన డివిజనల్ పంచాయతీ అధికారి: ప్రభాకర్

జగిత్యాల తాజా కబురు: బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగినట్లు అందిన ఫిర్యాదుతో గురువారం జగిత్యాల డివిజనల్ పంచాయతీ అధికారి ప్రభాకర్ తో పాటుగా మండల పంచాయతీ అధికారి అఫ్జల్ విచారణ చేపట్టారు. గ్రామ పంచాయతీ నిధుల వినియోగం విచారణ, పరిశీలనార్థం బుగ్గారం గ్రామ పంచాయతీ రికార్డులు స్వాధీనం చేసుకొని, పాలక వర్గం, పిర్యాదుదారుల వాంగ్మూలం తీసుకున్నారు. రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారులకు, పిర్యాదుదారులకు నివేదిక ఇస్తామని తెలిపారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కి మంజూరైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు బుగ్గారం ప్రజల అవసరాలకు ఉపయోగపడి, దుర్వినియోగం కాకుండా చూడాలని, పూర్తి స్థాయి విచారణ నివేదిక ఇవ్వాలని బుగ్గారం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కమిటీ కార్యవర్గం కోరారు. మీ దృష్టిలో ఉన్న అవకతవకలు రాసి ఇవ్వొచ్చని విచారణ అధికారి తెలుపగా, మీ విచారణ నివేదిక వచ్చిన అనంతరమే మా వద్ద గల ఆధారాలు బయట పెడుతామని గ్రామ అభివృద్ధి కమిటీ కార్యవర్గం తేల్చి చెప్పింది. వీలైనంత త్వరలో ఈ నాటి విచారణ నివేదిక, నిధుల వినియోగం, ఆధారాలు, సంబంధిత రికార్డుల ప్రకారం అటెస్టు చేసి ఇవ్వాలని విచారణ అధికారిని గ్రామ అభివృద్ధి కమిటి కోరింది.ఈ విచారణ జరుగుతుండగా సర్పంచ్ మూల సుమలత శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ చుక్క శ్రీనివాస్, వార్డు సభ్యులు, ఎంపిటిసి జోగినిపెళ్లి సుచెందర్, మండల కో-ఆప్షన్ సభ్యులు రహమాన్, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, విడిసి కార్యవర్గం పెద్దనవేని శంకర్, చుక్క మల్లారెడ్డి, ఏలేశ్వరం శంకరయ్య, విలసాగరం నందయ్య, సుంకం ప్రశాంత్, భారతపు గంగాధర్, బొడ్డు అనిల్, కొడిమ్యాల రాజన్న, కప్పల మల్లేశం, గొండ వెంకటేష్, ఎర్రం దుబ్బయ్య, నగునూరి వెంకన్న, ఏలేశ్వరం సాయి చరణ్ తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here