బుగ్గారం గ్రామపంచాయతీ లో రికార్డులు మాయం

0
254

సమాచారం కోరితే
రికార్డులు లేవని చేతులు దులుపుకున్న మండల అధికారులు…
దొంగ రికార్డులు తయారు చేస్తున్నారని వి.డి.సి ఆరోపణ నిధుల దుర్వినియోగం నిజమేనని ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలు

తాజా కబురు బుగ్గారం ప్రతినిధి: జగిత్యాల జిల్లా బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో రికార్డులు మాయం చేశారని, అధికారులు, పాలకులు కుమ్మక్కై నిధుల వివరాలు తెలుపడం లేదని,సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం సమాచారం కోరినా ఇవ్వడం లేదని బుగ్గారం గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆరోపించారు. శనివారం బుగ్గారం లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బుగ్గారం గ్రామ సభలల్లో గ్రామ పంచాయితీ నిధుల వివరాలు అడిగితే చెప్పలేదని,సమాచార హక్కు చట్టం ద్వారా కోరితే నెలలు గడిచినా అడిగిన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ప్రకారం మండల పరిషత్ కార్యాలయంలో అప్పీలేట్ అధికారికి మొదటి అప్పీల్ చేస్తే, బుగ్గారం మండల పరిషత్ కార్యాలయ సమాచార, అప్పిలేట్ అధికారులు సమాచారం ఇవ్వాల్సింది పోయి బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యదర్శి ద్వారా రికార్డులు లేవని, గత కార్యదర్శి అప్పగించలేదని లిఖితపూర్వకంగా ఇప్పించి మండల స్థాయి అధికారులు శనివారం చేతులు దులుపుకొన్నారని ఆయన ఆరోపించారు. బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిధులు దుర్వినియోగం అయి ఉంటాయని ప్రజల్లో నెలకొన్న అనుమానాలకు అధికారులు, పాలకులు వ్యవహరిస్తున్న తీరు మరింత బలాన్ని చేకూర్చు తుందన్నారు. పాలకులు, అధికారులు కుమ్మక్కై దొంగ రికార్డులు సృష్టిస్తున్నట్లు తెలిసిందని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. అధికారులు, నాయకులు కుమ్మక్కై ఎన్ని రకాల వేషాలు వేసినా బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల వివరాలు బయట పెట్టేదాక వదిలేది లేదని, న్యాయ పోరాటం చేస్తామని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు గొండ వెంకటేష్, చుక్క మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here