బిల్లు కట్టలేదని జిల్లా కలెక్టర్ ఇంటి కరెంట్ కనెక్షన్ కట్.

0
81

మంచిర్యాల తాజా కబురు:ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు పంపినప్పటికీ స్పందించకపోవడంతో ఫ్యాక్టరీకి వెళ్తున్న విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.దీంతో కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారుల ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎంసిసి సిమెంట్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న ఆ జిల్లా కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నత అధికారుల ఇళ్లకు ట్రాన్స్ కో అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా 2016 లో మంచిర్యాల జిల్లాను ఏర్పాటు చేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఉన్నత అధికారుల నివాసాలకు భవనాలు లేకపోవడంతో జిల్లా కేంద్రంలోని ఎంసిసి సిమెంట్ ఫ్యాక్టరీ లో పనిచేసే అధికారుల కోసం నిర్మించిన ఇళ్ళలో కొన్ని ఖాళీ ఉండడంతో వాటిలో జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆఫీస్, అడిషనల్ కలెక్టర్ నివాసం, డిసిపి నివాసాల కోసం కేటాయించి అందులోనే కొనసాగుతున్నాయి.అయితే ఎంసిసి సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం గత రెండు సంవత్సరాల నుండి ఫ్యాక్టరీకి సంబంధించిన విద్యుత్ బకాయిలుచెల్లించకపోవడంతో 11 కోట్ల మేర విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయి. పలుమార్లు ఫ్యాక్టరీ యాజమాన్యానికి నోటీసులు పంపినప్పటికీ స్పందించకపోవడంతో ఫ్యాక్టరీకి వెళ్తున్న విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో కలెక్టర్ తో పాటు ఇతర ఉన్నతాధికారుల ఇళ్లకు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.కాగా సాయంత్రం వరకు ఉన్నతాధికారుల ఇళ్లకు ప్రత్యేకంగా విద్యుత్ లైన్ వేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here