బిగ్ బాస్ షో లో ఎరక్కపోయి ఇరుక్కున్న గంగవ్వ…

0
427

తాజా కబురు డెస్క్:క్రియెషన్ కు ఎదికాదు అనర్వం అన్నట్టు ఇప్పుడు బిగ్ బాస్ చుట్టు తిరుగుతున్న మాట మై విలేజ్ షో “గంగవ్వ” అని ఖచ్చితంగా చెప్పచ్చు,తెలంగాణ యాసను స్పస్టంగా ,నాటి జమానలో మాట్లాడినట్టు మాట్లాడి బాగా పాపులార్టీ తెచ్చుకుంది గంగవ్వ.ఇప్పుడు కరోనా సమయం ఇంటిళ్లిపాది ఆరునెలలుగా ఏ ఎంటర్టైన్మెంట్ లేకుండా నానా చిరాకుగా ఉన్నారు,ఇప్పుడె బిగ్ బాస్ నాల్గవ సీజన్ ఆరంభించాలనుకున్నారు స్టార్ “మా” .కానీ గత సీజన్ కన్నా ఇంకా కొత్తగా ఉండాలి, అలాగె వినూత్నంగా ఉండాలన్నది వాళ్ల కాన్సెప్ట్,అవును ఎవరైన ఎప్పటికప్పుడు నూతనంగా ఆలోసిస్తెనె “రేటింగ్” వస్తుంది, అందులో బాగంగానే ఈ బిగ్ బాస్ సీజన్ నాలుగు కు మై విలేజ్ షో గంగవ్వ ను స్పెషల్ కంటెస్టెంట్ గా ఎన్నుకున్నారు,ఇప్పటివరకు పెద్దగా పాపులారీటి లేని కంటెస్టేంట్ లను పెట్టటానికి కారణం కూడా అదె కావచ్చు,లాస్య,నోయల్, కరాటే కళ్యాణి, అమ్మరాజశేఖర్,సాయికిరణ్ మినహా ఎవ్వరికి ఎక్కడ పాపులారిటీ లేదు, అక్కడక్కడ “టిక్ టాకుల్లో” యూట్యూబ్ లో మెరిసిన వారిని తీసుకువచ్చారు. కానీ ముఖ్యంగా గంగవ్వ ను మాత్రమే స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించారు .కానీ గంగవ్వకు సిటీ వాతావరణం తెలియదు,సిటి లో ఎలా ఉంటారో తెలియదు,ఇప్పుడు బిగ్ బాస్ లో జరుగుతున్న గందరగోళం, ఒకింత అమెకు అసహనాన్ని తీసుకొస్తుంది సంబంధం లేని టాస్క్ అవసరం లేని మాటలు అనవసరమైన గొడవలు, శృతిమించుతున్న అలకలు ఇవన్నీ గంగవ్వకు కొత్తగా కనిపిస్తున్నాయి.జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో లాంబాడీపల్లి మారుమూల ప్రాంతంలో ఉండె గంగవ్వ ఇప్పుడు నయా కల్చర్ కు వెళ్లి ఏం చెయ్యాలో తోచలేని పరిస్థితి కనిపిస్తుంది. అలాగె ఎలాంటి టాస్క్ లు చెయ్యకున్న గంగవ్వకున్న నాచురాలీటి వల్ల తెలంగాణ రాష్ట్రం లోనె కాదు ఇతర దేశాల్లో ఉన్న అమె ఫాలోవర్స్ అమెకు నిర్విరామంగా తమ మద్దతుతో ఓట్లు వేస్తూనె ఉన్నారు,కానీ ఆ షో ఏంటి అక్కడి పరిస్థితి ఏంటి,జరగబోయెది ఏంటి నేటి యువత భాషా, వ్యక్తుత్వం ఏంటి,మాడ్రన్ కల్చర్ లో ఉన్నవాళ్లకు మారుమూల పళ్లెలో జీవించిన గంగవ్వకు అంతగా సంభందాలు కుదరటం లేదు, కానీ బిగ్ బాస్ షో ఆరంభం రోజు కింగ్ నాగార్జున ఒక విషయం చెప్పాడు, గంగవ్వను అందరు జాగ్రత్తగా చూసుకోవాలని, అందుకె హౌజ్ లో ఉన్న ప్రతి ఒక్కరు గంగవ్వను ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకుంటు మార్కులు కొట్టాలని చూస్తున్నారు,ఏ టాస్క్ పెట్టిన గంగవ్వను మాత్రం ఒక ఇంటిపెద్దలాగె ఉంచుతున్నారు బిగ్ బాస్ టీం…

సప్పవడ్డ బిగ్ బాస్ షో…

ఇప్పుడు నడుస్తున్న బిగ్ బాస్ నాలవ సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్ లు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోతున్నారన్నది నిజం,గత మూడు సీజన్ లో ఉన్న స్టఫ్ మాత్రం ఈ సీజన్ లో లేదు అనిపిస్తుంది,కొత్తగా పెట్టిన ఇద్దరు కంటెస్టెంట్ లు వాళ్లు రావడం గొడవ పెట్టుకోవటం, అలాగె “కట్టప్ప” పేరు బాహుబలి సినిమాలో నాన్చినట్టు పదె పదె అదె పదం వాడుతూ ఆసాంతం ఆ కట్టప్ప చుట్టు తిరిగె విధంగా చెయ్యడం ప్రేక్షకుల్లో నిరాశ తీసుకొస్తుంది…

గంగవ్వ నాట్ ఏ నేం ఇట్స్ ఏ బ్రాండ్….

ఈ బిగ్ బాస్ సీజన్ మొత్తం‌ గంగవ్వ చుట్టు తిరుగుతుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే చాలావరకు బిగ్ బాస్ షోను అందరు గంగవ్వ కోసమే చూస్తున్నారనేది అన్నది నిజం, గంగవ్వ మాత్రం తన సహజ సిద్ధమైన తెలంగాణ యాసను మాట్లాడుతూ తాను ఎలా ఉంటుందో అలాగే ఉంటూ ,ప్రేక్షకుల మన్ననలు పొందుతుంది అయితే సీజన్ గడుస్తున్నకొద్దీ టాస్క్ లు పెరుగుతాయి, బిగ్ బాస్ క్రేజీ కోసం గంగవ్వ ను తీసుకువచ్చిన బిగ్ బాస్ టీం రానున్న రోజుల్లో గంగవ్వ కు ఉన్న ఫాలోవర్స్, ఓటింగ్ లను దృష్టిలో పెట్టుకొని కొనసాగిస్తారా లేక ఎలిమినేట్ చేస్తారా అన్నది ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న….. బిగ్ బాస్ షో ప్రధాన ఆయువుపట్టుగా నిలిచిన గంగవ్వ మరి కొంతకాలం పాటు చూస్తామా ,లేదా అన్నది మాత్రం అర్థం కాని పరిస్థితి .మొత్తానికి అయితే మారుమూల గ్రామం నుండి తన మాటల తో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన గంగవ్వ నిజంగా అభినందనీయురాలే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here