బాసర ట్రిపుల్ ఐటీ కి ఎంపికైన తాట్లవాయి విద్యార్థులు

0
170

రాయికల్ తాజా కబురు: బాసర ట్రిపుల్ ఐటి ఫలితాలు మంగళవారం వెలువడగా రాయికల్ మండలం తాట్లవాయి ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటి లో సీట్లు సాధించినట్లు ప్రధానోపాధ్యాయులు కరుణాకర్ తెలిపారు. లావుడ్య రఘు ,గుగ్లోత్ వినోద్ ఇద్దరు విద్యార్థులు బాసర ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించారని పేర్కొన్నారు .సీట్లు సాధించిన విద్యార్థులను ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేందర్,జడ్పీటీసీ జాదవ్ అశ్విని ,సర్పంచ్ రాగి సాగరిక శ్రీనివాస్ ,మండల విద్యాధికారి గంగాధర్ ,ఉప సర్పంచ్ మల్లయ్య ,పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్,ఉపాధ్యక్షుడు లావణ్య మల్లేశం విద్యార్థులను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here