బావి లేదు… మిషన్ భగీరథ నీరు లేదు.. ఒకే బోరు నీటిపై 50 ఇండ్లు ఆధారపడ్డాయి…

0
217

రాయికల్ తాజాకబురు: మండలంలోని పలు వార్డులతో పాటుగా 11 వ వార్డుకు చెందిన ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. వేసవి ముంచుకస్తున్న తరుణంలో భానుని ప్రతాపంతో భూగర్భ జలాలు అట్టడుగు స్థాయికి వెళ్లాయి. ఇక పట్టణ జనాభాకు సరిపడా నీరు అందటం లేదు.

తమ నీటి కష్టాలు తీర్చాలంటూ రాయికల్ పట్టణంలోని 11వ వార్డు కౌన్సిలర్ మ్యాకల అనురాధ-రమేష్ సోమవారం మున్సిపల్ కమిషనర్ కు నీటి సమస్యలపై వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వార్డు ప్రజలు నీటి కొరత వల్ల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని వార్డులో సరిపడా బావులు, బోర్లు లేవని మిషన్ భగీరథ నీరు కూడా రావడం లేదని ఒకే బోరుపై 50 ఇండ్ల ప్రజలు నీటి అవసరాలు తీర్చుకోవడం వల్ల సరిపడా నీరు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వెంటనే నీటి అవసరాలు తీర్చేందుకు ట్యాంకర్ ఏర్పాటు చేయాలనీ కమిషనర్ ను కోరినట్లు ఆమె తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here