బాలల హక్కుల రక్షణ మనందరి బాధ్యత

0
33

జగిత్యాల తాజా కబురు:చైల్డ్ లైన్ సే దోస్తీ వారోత్సవాల్లో భాగంగా మంగళవారం స్థానిక ట్రాఫిక్ ఇనిస్టిట్యూట్లో జిల్లా బాలల పరిరక్షణ విభాగం మరియు చైల్డ్ హెల్ప్ లైన్ -1098 వారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ చేతుల మీదుగా బాలల హక్కుల పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ కోసం వివిధ ప్రభుత్వ శాఖలతో పోలీస్ శాఖ సమన్వయంతో పని చేయడం జరుగుతుందని, బాల్య వివాహాలు, బాలలపై వేధింపులకు కు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్న వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 లేదా డయల్ 100 ను సంప్రదించి బాలలు తగిన రక్షణ పొందవలసిందిగా తెలిపారు.ఈ యొక్క కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.సురేష్, డీఎస్పీ లు గౌస్ బాబా, ప్రతాప్,చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సమన్వయ కర్త శ్రవణ్, పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here