బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి-సర్పంచ్ రమాదేవి

0
256

రాయికల్ తాజా కబురు: చిన్నపిల్లలు పనికి పోకుండా బడికి వెళ్లేలా, బాల్యవివాహాలు జరుగకుండా చూడాలని సర్పంచ్ బెజ్జంకి రమాదేవి-మోహన్ అన్నారు. సోమవారం గ్రామ పంచాయితీ కార్యాలయం లో సర్పంచ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాలల పరిరక్షణ కమిటి వేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలో ఎవరైనా బాలికలతో అమర్యాదగా ప్రవర్తించినచో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, బడి ఈడు పిల్లలను బడి లోనే వుంచాలని, పనికి తీసుకపోతే బాలకార్మిక చట్టం ప్రకారం చర్యలు తీలుకోబడతాయని, బాలల హక్కులను పరిరక్షణకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఆకుల మహేష్, ఉప సర్పంచ్ జకిలేటి హరీష్ రావ్, యస్.ఎం.సి. చైర్మన్ వారి రవి, సెక్రటరీ మనోహర్, ఆర్.యు.పి.పి.టి. జిల్లా అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్, వి.ఆర్.వో. నాగరాణి, ఐసిడియస్ మండల సూపర్ వైజర్ శంకరమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు జుంబర్తి జమునా, బొడ్డుపెల్లి రమాదేవి , బెజ్జంకి భాగ్యలక్ష్మీ, ఆశా వర్కర్లు మమత, లత, లావణ్య, కారోబార్ చిలువేరి శిరీష, స్కూల్ పిల్లలు, తల్లులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here