తాజాకబురు: బాబ్రీ కేసు తేలిపోయింది. పథకం ప్రకారం జరగలేదని, నిందితులందరూ నిర్దోషులేనంటూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 32 మంది నిందితులు..28యేళ్ళ పాటు సుదీర్ఘ విచారణ అనంతరం బుధవారం కట్టుదిట్టమైన భద్రత చర్యల మధ్య లక్నో లోని సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. రెండువేల పేజీలు ఉన్న ఈ తీర్పు కాపీనీ న్యాయమూర్తి సురేంద్ర కుమార్ యాదవ్ చదివారు. సీబీఐ సమర్పించిన ఆడియో , వీడియా ఆధారాల మూలంగా నిందితులను దోషులగా తేల్చలేమని కోర్టు స్పష్టం చేసింది. నిందితులపై ఇచ్చిన ఆధారాలు బలంగా లేవని కోర్టు అభిప్రాయపడింది.1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కర సేవకులు కూల్చివేసిన విషయం తెలిసిందే. అయితే, అద్వానీ, మురళీమనోహర్ జోషి వంటి బీజేపీ నేతలతో పాటు సంఘ్ పరివార్ నేతలు ప్రజలను రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపణలు రాగా, ఈ కేసులో నిందితులుగా బీజేపీ నేతలు ఎల్కే ఆద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతితో పాటు సంఘ్ పరివార్ నేతలు చాలామంది ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కాగా, తీర్పు సమయంలో నిందితులంతా కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశించగా, 11మంది మాత్రం హాజరుకాలేదు. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఉండగా, ఇందులో 17 మంది మృతి చెందారు. మిగిలిన 32 మంది నిందితుల్లో, 21 మంది నిందితులు కోర్టుకు హాజరు కాగా, లక్నోలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే, నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. దీంతో నిందితులు అందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. నిందితులు ఎవరూ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న ఆధారాలు లేవని, దాంతో వారంతా నిర్దోషులేనని స్పష్టం చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు సిబిఐ కోర్టు బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువరించడంతో ఉత్కంఠకు తెరపడినట్లయింది.
Latest article
తుంగూర్ లో దారుణం…ఎంపీడీవో,ఎస్సైపై పెట్రోల్ పోసిన రైతు,ఎంపీడీవోకు గాయాలు ..
తాజాకబురు జగిత్యాల:జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూర్ లో దారుణం చోటుచేసుకుంది, ఇంటి నుండి రహాదారి కోసం సర్వే నిర్వహిస్తుండగా అక్కడె ఉన్న చుక్క గంగాధర్ అనే రైతు పొలంలో కొట్టె మందు...
కట్లకుంట కెనాల్ ప్రమాదంలో నీటిలోనె ఉండగా కదిలించిన చివరి సంబాషణ…
కెనాల్ ప్రమాదంలో కదికించిన చివరి సంబాషణలు.....
నాన్న మనం నీటిలో పడిపోయాం,ఎలా...ఎలా...ఏం కాదమ్మ ఈ కారు చుట్టు అద్దాలు ఉన్నాయి నీళ్లు లోపలికి చేరెవరకు మనం బయట పడుతాం, అన్నయ్యకు,నాకు,నీకు ఈత వచ్చు మనం...
ఆ కుటుంబంలో అన్నీ ప్రేమికుల రోజె…….జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
ప్రేమికుల రోజు పండగ....జన్మించింది,ప్రేమించింది,ప్రేమను వ్యక్తికరించింది,వివాహాం చేసుకున్నది ఫిబ్రరవరి 14..
తాజాకబురు:ప్రేమ ఈ రెండు పదాలు ప్రేమికులకు ప్రపంచాన్ని సుందరంగా చూసె విధంగా చేస్తాయి, ప్రేమ ఈ రెండు పదాలు రెండు కుటుంబాలను కలుపుతాయి,సంతోషాన్ని నింపుతాయి,...