బాబు జగ్జీవన్ రావ్ విగ్రహానికి భూమి పూజ

0
128

తాజా కబురు రాయికల్ రూరల్:మండలంలోని వడ్డే లింగాపూర్ గ్రామం అంలో అంబేద్కర్ కమ్యూనిటీ భవనం వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి సోమవారం జగిత్యాల జిల్లా ఎస్సీ కార్పొరేషన్ స్టాండింగ్ చైర్మన్ బత్తిని అరుణ భూమి పూజ చేశారు, తెలంగాణ అంబేద్కర్ సంఘం మరియు అంబేద్కర్ సంఘాల నాయకులు మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ కమ్యూనిటీ భవనాన్ని కావాలనే వివాదం చేస్తున్నారని దళితులకు చెందిన అంబేద్కర్ కమ్యూనిటీ భవనం గ్రామానికి ఆపాదించడం సరికాదని అన్నారు.తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇరుగురాళ్ల ఆనందం ,జగిత్యాల కౌన్సిలర్ బాలే శంకర్ మాట్లాడుతూ దళితులకు చట్టబద్ధంగా చెందాల్సిన నిధులు కేటాయించక పోగా వారికున్న కమ్యూనిటీ భవనాన్నీ వివాదం చేయవద్దని అన్నారు.ఈ కార్యక్రమంలో తిరుపతయ్య ,ఈధుల లక్ష్మణ్ కుమార్ ,మోర్తాడు సాయి, వడ్లూరు దినేష్, వడ్లూరి రాజేందర్ ,మారంపల్లి రమేష్, నరేష్ ,శివ ,రాజేందర్ ,లక్ష్మణ్ వినోద్ ,సాయి ,శ్యాం తదితరులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here