బతికుండగానే చంపేశారు…

0
388


కాళ్ళు మొక్కుతా బాంచన్ పింఛను ఇప్పియారు.
ఆరు నెలలుగా పింఛను రావడం లేదు
తిరిగి తిరిగి అలిసిపోయాము…

బాధితురాలు అన్నారపు మల్లవ్వ

తాజా కబురు మల్లాపూర్ ప్రతినిధి: బతికున్న మనిషిని అధికారులు ఆసరా పింఛను పత్రాల్లో చంపేసారంటూ జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామానికి చెందిన మగ్గిడి గంగారాం (70), అన్నారపు మల్లవ్వ (65) లు తాజా కబురు ప్రతినిధితో తమ గోడును వెళ్లబోసుకున్నారు. తమకు గతంలో ఆసరా,వితంతు పింఛను డబ్బులు వచ్చాయని అయితే తమ గ్రామానికి చెందిన చిట్యాల మల్లవ్వ చనిపోయిన నాటి నుండి తనకు పించను డబ్బులు రావడంలేదని మల్లవ్వ, తన పేరుతో ఉన్న మరో మగ్గిడి గంగారాం చనిపోయిన నుండి తనకు పింఛను రావడం లేదని మగ్గిడి గంగారాం యొక్క భార్య, మల్లవ్వ ఆరునెలల నుంచి తమ బ్యాంకు ఖాతాలో పింఛన్‌ సొమ్ము జమ కావడం లేదని బాధితులు తెలిపారు.గత ఆరు నెలలుగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగిన వస్తది పో అంటూ అధికారులు, ప్రజా ప్రతినిధులు బెదిరిస్తున్నారని,మానవతా దృక్పతంతో జాలి కూడా చూపించకుండా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న మమ్మలను ఈ పరిస్థితిలో చెప్పులు అరిగేలా తిప్పించుకుంటున్నారని దీంతో తమకు ఏం చేయాలో పాలుపోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here