బతికి ఉండగానే చంపేశారు-జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన-సి.సి.ఆర్

0
197

బాధితులకు ఆసరా పింఛన్ ఇప్పించడని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్

జగిత్యాల తాజా కబురు:కౌన్సిల్ పర్ సిటిజెన్ రైట్స్ సంస్థ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని నడికుడ గ్రామం లోని అన్నారపు మల్లవ్వ మరియు మగ్గిడి గంగారాం అనే వృద్ధుల ఆసరా పెన్షన్ దారులు బ్రతికి ఉండగానే చనిపోయినట్టుగా రికార్డులలో నమోదు చేసి సుమారు అయిదు నెలలపాటు ఆసరా పించెను డబ్భులు రాకుండా చేసి కారోన కాలంలో ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసిన భాద్యులైన ప్రభుత్వ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ భాదితులు నష్టపోయిన అయిదు నెలల పించెను డబ్భులు రికవరీ చేయించి బాధితులకు చెల్లించే విధంగా మరియు జిల్లాలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ సోమవారం కౌన్సిల్ పర్ సిటిజెన్ రైట్స్ జగిత్యాల జిల్లా ప్రతినిధులు జలందర్,చిన్నారెడ్డి,జయప్రకాష్,మహేష్,సాయి రాజ్ జిల్లా కలెక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారిలతో పాటుగా జిల్లా పంచాయితీ అధికారులకు పిర్యాదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here