బడిని బర్ల కొట్టంగా మార్చిన సర్పంచ్ భర్త నిజమేనా…. ?

0
203

తాజా కబురు నిర్మల్ ప్రతినిధి: స్థానిక సంస్థల్లో పురుషులతో సమానంగా మహిళలకూ సరైన ప్రాధాన్యం దక్కాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెచ్చిన చట్టాలు కొందరికి చుట్టాలు అవుతున్నాయి. జిల్లా, మండల, గ్రామ సర్వసభ్య సమావేశాల్లో భార్యలకు బదులుగా భర్తలు హాజరైతే ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సమావేశాలకు మహిళా ప్రజాప్రతినిధులకు బదులుగా వారి భర్తలను ఆహ్వానించే అధికారులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పంచాయతీ రాజ్‌ చట్టం -2018 ప్రకారం శిక్ష తప్పదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం హెచ్చరించింది.

కానీ మారు మూల గ్రామాల్లో మాత్రం భర్తలే పెత్తనం చెలాయిస్తూ సమస్యల పరిస్కారం చేయడం లేదని సామజిక మాధ్యమాల్లో పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి.వివరాల్లోకి వెలితే నిర్మల్ జిల్లా కడెం మండలం కల్లెడ గ్రామానికి చెందిన సర్పంచి వెంబడి లావణ్య యొక్క భర్త బడిని బర్ల కొట్టంగా మార్చారని.గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ను సైతం తన సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని, అత్త పెత్తనం కోడలి కాపురం లాగా సర్పంచి కుటుంబీకుల వ్యవహారం కొనసాగుతుందని, కరోనా సమయమని ప్రాథమికోన్నత పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో బడినే బర్ల కొట్టంగా మార్చేశారని,బడికి ఆనుకొని ఉన్న కాలి స్థలంలో రేకులతో షెడ్ వేసి అందులో బర్రెలను కట్టివేస్తున్నారని,అంతేకాకుండా గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ ను తన సొంత అవసరాల పేరిట ఉపయోగించుకుంటున్నారని, గ్రామపంచాయతీ లో ఉండాల్సిన ట్రాక్టర్ ను సైతం బడి వద్దనే పెడుతున్నారని సంబంధిత అధికారులు ఆ గ్రామం వైపు చూసి తక్షణమే ఆ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here