ఫంక్షనల్ వర్టికల్ విధానంపై జిల్లా ఎస్పీలతో, పోలీస్ కమిషనర్ల తో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్

0
23

జగిత్యాల తాజా కబురు:పోలీస్ శాఖలో ఉన్న వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది యొక్క పని లో పారదర్శకతను, పనితీరును పరిశీలించడానికి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ఫంక్షనల్ వర్టికల్ విధానంపై తీసుకుంటున్న చర్యల గురించి మరియు జిల్లాలో వర్టికల్ విధానం అమలవుతున్న తీరు గురించి అన్ని జిల్లాల ఎస్పీ లతో,పోలీస్ కమీషనర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర డీజీపీ మహేందర్ మంగళవారం నిర్వహించారు.ఫంక్షనల్ వర్టికల్స్ అయిన స్టేషన్ రైటర్స్, రిసెప్షన్, క్రైమ్ రైటర్స్, బ్లూ కోట్స్, పెట్రో కార్స్, క్రైమ్ స్టాఫ్, కోర్టు వర్క్, టెక్ టీం, వారెంట్స్, సమన్స్, సెక్షన్ ఇన్చార్జ్,మెడికల్ సర్టిఫికేట్,5S, డయల్ 100,ఫెల్ట్ మేనేజ్మెంట్, కమ్యూనిటీ పోలీసింగ్, ట్రైనింగ్స్ వాటి పై డీజీపీ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా ఆయా యూనిట్స్ లో ఉన్న ఏ అధికారి అయితే సంబంధిత వర్టికల్ కు ఇంచార్జ్ గా ఉంటారో ఆయొక్క వర్టికల్ కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలని సూచించారు. వర్టికల్స్ కు సంబంధించి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిబ్బంది, అధికారులతో ట్రైనింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని, ఉత్తమ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి, అధికారులకు KPI రివార్డులు లు ఇవ్వాలని సూచించారు.గత సంవత్సర కాలంగా ఫంక్షన్ వర్టికల్ లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ వివిధ పోలీసు స్టేషన్లలో ఫంక్షనల్ వర్టికల్స్ ను సరియగు విధంగా అమలు పరుస్తున్న సిబ్బందికి,అధికారులకు అభినందించి ప్రశంస పత్రాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా నుండి ట్రాఫిక్ ఫంక్షనల్ వర్టికల్ లో ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ జిల్లాలో గత సంవత్సరం తో పోల్చుకుంటే ఈ సంవత్సరం 42% రోడ్డు ప్రమాదాల నివారణ కు కృషిచేసిన ట్రాఫిక్ ఎస్.ఐ అనిల్ ను డిజిపి అభినందించి ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రశంస పత్రాన్ని జిల్లా ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు.ఈ యొక్క సమీక్ష సమావేశం అదనపు ఎస్పీ శ్రీ కె. సురేష్ గారు, డీఎస్పీ లు వెంకటరమణ,గౌస్ బాబా, ప్రతాప్,DCRB ఇన్స్పెక్టర్ రాఘవేంద్రరావు,ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్ మరియు ఫంక్షనల్ వర్టికల్ ఇన్చార్జులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here