రాయికల్ తాజా కబురు: నిరుపేద గిరిజనులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం, ఆకలితో ఉన్నవారికి సహాయం చేసే ఆనందం ప్రపంచంలో మరొకటి లేదని రాయికల్ మండల ప్రెస్ క్లబ్ పాత్రికేయులు అన్నారు. మంగళవారం రోజున మండలంలోని మంక్త్యానాయక్ తండా గ్రామంలో గల గిరిజన నిరుపేదలకు కరోనా వైరస్ విపత్కర సహాయార్థం పట్టణానికి చెందిన పాత్రికేయులు కడకుంట్ల జగదీశ్వర్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలో పేదవారికి అండగా ఉండాలని లాక్ డౌన్ సందర్భంగా ఎవరికీ పనిలేకుండా పోయిందని అటువంటి నిరుపేదలను గుర్తించి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయులు ఎద్దండి ముత్యంపు రాజురెడ్డి, వాసం లింబాద్రి ,చింతకుంట సాయికుమార్,కనికరపు లక్ష్మణ్,చెలిమెల మల్లేశం, కళాకారులు గంగాధర్ నాయక్, డాక్టర్ ఈదుల లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.