ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి- కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు

0
63

ప్రశాంతమైన వాతావరణంలో వినాయక నిమజ్జన వేడుకలు జరుపుకోవాలి- కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు

తాజా కబురు కోరుట్ల :వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఎంత పవిత్రంగా గణనాథునికి పూజలు చేసి అంతే పవిత్రంగా నిమజ్జనం చేయాలని ,ఎలాంటి మద్యం సేవించకుండా నిమజ్జన ఉత్సవాలు జరుపుకోవాలని కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు అన్నారు, కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో యువతతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడుతూ… నేటి యువత భక్తి మార్గం లోకి వెళ్లి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి నిమజ్జనం రోజు మద్యం సేవించకుండా, శాంతియుత వాతావరణంలో నిమజ్జనం చేయాలని అని అన్నారు, శబ్ద కాలుష్యం రాకుండా చూసుకుంటూ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఎస్సై సతీష్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ భీమ రెడ్డి ,ఉపసర్పంచ్ లాస్య, ఎంపీటీసీ మాధురి, గ్రామ యువజన సంఘాలు, యువకులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here