ప్రయోగంలో బెస్టు అభివ్రుద్దిలో ఫస్ట్, వాకీటాకీ గ్రామం, అక్కడ అన్ని ప్రయోగాలే…..

0
264

తాజా కబురు హైదరాబాద్ డెస్క్:

వాకీటాకీల గ్రామం,ఆ గ్రామంలో ఎక్కడ చూసిన వినూత్న ప్రయోగాలే…

అన్ని గ్రామాల్లాగ తన గ్రామం ఉండకూడదు అనుకున్నాడు, అందరిపాలనలాగా తన పాలన ఉండకూడదని డిసైడ్ అయిపోయాడు, గల్ఫ్ లో నేర్చుకున్న పనిని గ్రామంలో చేసి చూపిస్తున్నాడు, ఓ నయా సర్పంచ్ నయా పద్దతులపై తాజకబురు అందిస్తున్న కథనం..

వాకిటాకీ తో సర్పంచ్ గడీల గంగాప్రసాద్

వాకిటాకిలు అంటే మనకు గుర్తుకువచ్చేవి పోలిసులు,ఉన్నత అధికారులు,వాటిని చూస్తేనె ఒకరకమైన హుందాతనం, భయం కనిపిస్తుంది,ఏ హైదరాబాదో లేకా ఎక్కడో అరుదుగా కనిపిస్తాయి, కానీ ఇప్పుడు గ్రామీణప్రాంతాల్లో ఈ వాకిటాకిల అవసరం పడింది ఎందుకో తెలుసకోండి..

ఇది జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్రియాల గ్రామం ఇక్కడ సుమారు 4400 జనాభ నివసిస్తు ఉంటారు, మండలంలోని మారుమూల గ్రామంగా ఉండేది, గతంలో ఉన్న నాయకులు కూడా అదె రీతిలో పాలన సాగించెవాళ్లు దాంతో ఈ గ్రామం అభివ్రుద్దికి ఆపడదూరంలోకి వెళ్లిపోయింది, గత ఎన్నికల్లో గ్రామానికి చెందిన గడీల గంగాప్రసాద్ అనె వ్యక్తి సర్పంచ్ గా పోటి చేశాడు, అతను గత పదిహేను సంవత్సరాలుగా విదేశాలకు వెళుతున్నాడు, గతంలో ఆయన గ్రామంలోని ఆలయాలకు, పాటశాలకు చేసిన సేవలను గుర్తించిన ప్రజలు అతనిపై నమ్మకముంచి గెలిపించారు, అప్పటికె అస్తవ్యస్తంగా ఉన్న గ్రామాన్ని గాడిలో పెట్టె పనిని బాద్యతగా తీసుకున్నాడు సర్పంచ్ ప్రసాద్, ముఖ్యంగా గ్రామంలో అపరిశుభ్రతపై ద్రుష్టి పెట్టాడు, వీధివీధిలో చెత్త చెదాలను శాశ్వతంగా రూపుమాపాలి అనుకున్నాడు, అదె తడువుగా గ్రామపంచాయితీ సిబ్బందిని తీసుకున్నాడు, వారికి వారం పాటు విదేశాల శైలీలో శిక్షణ ఇప్పించాడు

వాకీటాకీతో సమాధానం చెపుతున్న పారిశుధ్యకార్మికుడు

వారికి ఓ డ్రెస్ కోడు, అలాగె పనులపై శ్రద్ద పెరిగేలా నెలనెల సకాలంలో జీతాలు ఇవ్వడం ప్రారంభించాడు, ఆ సమయంలోనె పళ్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది అందులో బాగంగా గ్రామంలో చేసిన పనులకు అవార్డు దక్కింది, కానీ ఏదో లోపం కనిపించింది ప్రసాద్ కి, అదె పారిశుధ్యకార్మికుల మద్య సమన్వయ లోపాన్ని గుర్తించాడు, ఉదయం ఏడు గంటలనుండి సాయంత్రం వరకు వాళ్లు నిర్వర్తించె పనిని ఎప్పటికప్పుడు గమణించాడు, అందులో బాగంగా గ్రామపంచాయితీలో బయోమెట్రిక సిష్టం ను ప్రారంభించాడు, ఉదయం పనుల్లోకి చేరినప్పుడు తంప్ చేసి, మళ్లీ డ్యూటీ అయిపోయాకా మళ్లీ తంప్ చేసేలా ఓ సిస్టం పెట్టాడు, దాంతో తొమ్మదిమంది సిబ్బంది సమయం ప్రకారం రావటం పనులు నిర్వర్తించటం చేశారు, అయితె మారుమూల గ్రామం కాబట్టి ఆ గ్రామంలో సెల్ ఫోన్లు సరిగ్గా పని చెయ్యవు దాంతో, పంచాయితీ సిబ్బందికి వాకిటాకీలతో పని నిర్వర్తించేలా నూతనంగా శ్రీకారం చుట్టారు,దాంతో గ్రామ సర్పంచ్, యంపిటీసి, కార్యదర్శి, తొమ్మిదిమంది సిబ్బంది, ఇలా అందరు పని వేళల్లో ఎప్పటికప్పుడు వాకిటాకీల ద్వార పనులు నిర్వర్తిస్తుండటంతో గ్రామం సంవత్సరకాలంలో పూర్తిగా మారిపోయింది.

ఎక్కడ చెత్త కనిపించటం లేదు, రెండవ పళ్లెప్రగతిలో కూడా ఉత్తమ గ్రామపంచాయితీ అవార్డు పొందారు, అలాగె గల్ఫ్ లో ఉన్నటువంటి ఎక్విమెంట్ ను వాడుతున్నారు, కార్మికుల్లో కాస్తా వయసుపైబడిన వాళ్లకు స్పెషల్ పరికరాలను తీసుకువచ్చారు, అలాగె ప్రభుత్వం అందించిన తడి, పొడి చెత్త డబ్బాలను కాకుండా అందరిని అనుకూలంగా ఉండె నూతన పరికరాలతో తయారు చేయించారు, నిత్యం గ్రామంలో బ్లీచింగ్, అలాగె కరోనా సమయం నుండి హైడ్రోక్లైరైడ్ స్పై చేపిస్తున్నారు, గ్రామ ప్రజలకు ఎప్పుడు అందుబమాటు ఉండి గ్రామానికి సంభంచించిన ఏ సమస్యనైన ఇట్టె పరిస్కరిస్తున్నారు, వాకిటాకీ ద్వారా గ్రామాన్ని సుందర గ్రామంగా తీర్చిదిద్దుతున్నారు, గ్రామంలో ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉందని ఒకప్పుడు కాలు కదిపితె బురుద ఉండేదని ఇప్పుడు ఎంతొ అభివ్రద్ది చెందిందని గ్రామస్తులు చెపుతున్నారు, కరోనా సఢలింపు రాష్ర్ట, కేంద్రప్రభుత్వాలు ఇచ్చిన ఈ గ్రామం ఇప్పటికి స్వచ్చందగా గ్రామ వ్యాపారాలను పని వేళల ప్రకారం నడిపిస్తున్నాయి.

గ్రామ ప్రథమపౌరుడు గ్రామాన్ని మార్చాలని చూస్తె ఏ గ్రామమైన ఇలా అభివ్రుద్దివైసు దూసుకుపోతుంది ఏమంటారు…?
మురికికాలువలు,గతంలో ఉన్న సమస్యలు ఇప్పుడు ఎక్కడ కనిపించటం లేదని గ్రామస్తులు అంటున్నారు, కరోనా ప్రబలుతున్న తరుణంలో ప్రతి రోజు రసయాన స్ప్రె చెయ్యటం,ఎవరైన ముంబాయి, ఇతర దేశాలనుండి వచ్చినవారిని గ్రామ శివారులోని క్వరంటైన్ లో ఉంచటం ,అలాగె వాల్ళు తీసుకోవల్సిన జాగ్రత్త లపట్ల ఎప్పటికప్పుడు అవగాహాన కల్పిస్తున్నారు. గ్రామ పంచాయితీ వార్డు మెంబర్లతో ప్రతి నెల సమావేశం నిర్వహించి గ్రామాభివృద్ధి కోసం అనునిత్యం అభివృద్ధి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here