రాయికల్ తాజా కబురు: పట్టణంలోని రెవెన్యూ,పోలీస్, వైద్య మున్సిపల్ సిబ్బందికి, మంగళవారం పట్టణ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను ఎం.పి.టి.సి సభ్యులు రాజనాల మధు కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం వచ్చిన మహిళలకు పండ్లు పంపిణీ చేసి, అయోధ్య గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబానికి నిత్యావసర సరుకులు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో వివిధ శాఖల ప్రభుత్వ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మదం మల్లేష్, జిల్లా పట్టణ కార్యదర్శి అమ్మ మహేష్, కార్యకర్తలు అనిల్, నరేష్, అంజి,సిద్దు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.