ప్రభుత్వ వైఫల్యం వల్లే రైతులకు ఇబ్బందులు

0
246

రాయికల్ తాజా కబురు: మండలంలోని మైతాపూర్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎం.ఎల్.సి జీవన్ రెడ్డి బుధవారం పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వాలు వరిధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఉన్న ప్రదేశాల్లో ఓపెన్ నెట్టింగ్ ద్వారా ధాన్యం కొనుగోలు చేశాయని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు మిల్లర్ల మోసాలనుండి రైతులకు విముక్తి కలిగేందుకే అప్పటి ప్రభుత్వం ఐకేపీ సెంటర్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించిందని, ఆ విధమైన పద్దతులను ప్రస్తుత ప్రభుత్వం నిర్మాణాత్మక కార్యాచరణను చేపట్టలేకపోతుందని ఎద్దేవా చేశారు. రైతుల నుండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు వరి ధాన్యం కొనుగోలు చేసేటపుడు ప్రతి క్విన్టలు తూకం వేయడానికి 32 రూపాయల కమిషన్ తీసుకుంటున్నారని అది చాలదని ఒక్కో క్విన్టల్ కు నాణ్యత లోపం, తరుగు కోసం రైతు 180 రూపాయల వరకు నష్టపోతున్నాడని రైతులను ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని అన్నారు. ధాన్యం తూకం వేయడంలో స్థానిక సీఈఓ ఇబ్బందులకు గురి చేయడం పై రైతులు జీవన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా సీఈఓ తీరు పై సంబంధిత అధికారులకు స్వయంగా పిర్యాదు చేస్తానని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు.

జిల్లాలో సుమారుగా 2 లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతుందని,రైతు ఆశించిన పంట దిగుబడి కాక సుమారు 240 కోట్ల వరిధాన్యం దిగుబడి తగ్గిపోయిందని, రైతు ఓ వైపు దిగుబడి రాక గిట్టుబాటు ధరలు లేక ఆవేదన చెందుతున్న తరుణంలో ప్రభుత్వ నిర్లక్ష ధోరణి వీడాలని, ధాన్యం కొనుగోలు ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలం అయ్యిందని, తక్షణమే ధాన్యం కొనుగోలు చేసే ఏర్పాట్లు చూడాలని జిల్లా కలెక్టర్ ను ఫోన్ ద్వారా కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here