ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన రాయికల్ మున్సిపల్ చైర్మన్

0
164

రాయికల్ టౌన్ తాజా కబురు: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు తనిఖీ చేశారు.ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం లాక్ డౌన్ ను సడలించినందున వేరే రాష్ట్రం నుండి , వేరే జిల్లాల నుండి వచ్చిన వారి వివరాలు తీసుకొని వారిని పకడ్బందీగా స్వియ నిర్బంధంలో ఉండేలా చూడాలని ఎ.ఎన్.ఎం కార్యకర్తలకు సూచించారు. ఆసుపత్రిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడాలని వైద్యులను కోరారు. మండలంలో ఒక్క కరోన కేసు కూడ నమోదు కాకపోవడం వెనుక వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేనివని వైరస్ వ్యాప్తి నివారణకు కృషి చేసిన వైద్య,ఆశా,ఎ.ఎన్.ఎం సిబ్బందిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ క్రిష్ణ చైతన్య ,కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, వల్లకొండ మహేష్,మారంపెళ్లి సాయికుమార్,కన్నాక మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here