ప్రభుత్వ అనుమతులు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

0
177

రాయికల్ తాజా కబురు: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP )రాయికల్ శాఖ) ఆధ్వర్యంలో బుధవారం స్థానిక శ్రీనిధి కళాశాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మదం మల్లేష్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కొవిడ్-19 సమయంలో ఎటువంటి విధి విధానాలు ప్రకటించక ముందే ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ క్లాస్ ల పేరుతో పెద్ద మొత్తంలో ఫీజులు దోపిడీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమని అన్నారు. ఫీజుల దోపిడీని నియంత్రించాలని అదేవిధంగా ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి సమయంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ప్రభుత్వ అనుమతి లేకుండా కరోనా సమయంలో అడ్మిషన్ నిర్వహిస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని, కరోనా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పాఠశాల విద్యలో ఫీజులు అడ్మిషన్ అడ్మిషన్ బోధన పై ప్రభుత్వం విధి విధానాలు ప్రకటించాలి మరియు కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్నటువంటి ఉపాధ్యాయులను తొలగించిన పాఠశాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అదే విధంగా బ్రాండ్ పేరుతో కరోన వల్ల తెలంగాణ పల్లెలకు విస్తరిస్తున్న కార్పొరేట్ విద్యా విధానాన్ని నిషేధించాలని అలాగే తొలగించిన ప్రైవేటు ఉద్యోగులను వెంటనే వారికి చెల్లించవలసిన జీతం చెల్లించి వారిని విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల నగర కార్యదర్శి అమ్ముల మహేష్ కార్యకర్తలు కార్తీక్ మాదిరే హరీష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here