ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు

0
132

జగిత్యాల తాజా కబురు: పట్టణంలోని బిజెపి కార్యాలయంలో నియోజకవర్గ ఇంఛార్జి ముదిగంటి రవీందర్ రెడ్డి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం 7000 కోట్లు తెలంగాణకు మంజూరు చేస్తే 290 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం అనడం సిగ్గుచేటు అని అన్నారు . కేంద్రం ఇచ్చిన కోవిడ్ -19 నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కర్చుబెట్టకుండ వ్యక్తిగత ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగియించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత ACS RAJU , అముధా రాజు, కిషోర్ సింగ్,లింగాల శ్రీకాంత్ రావు, జిత్తవెనీ అరుణ్ కురచలం సతీశ్,గట్టపెళ్ళీ జ్ఞనేశ్వర్,మదిశెట్టి మల్లేశం,విద్య సింగ్, పవన్ సింగ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రానికి 7000 కోట్లు అందించిన పూర్తి వివరాలను ఆయన మీడియా కు తెలిపారు.
1) ప్రధానమంత్రి కిషన్ సమ్మన్ యోజన కింద 652 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి జమచేయడం జరిగింది.
2) జనదన్ ద్వారా మహిళలకి 53 లక్షల ఖాతాలోకి 3 నెలలకి నెలకు 500/ చొప్పున 790 కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది.
3) ఉజ్వల పథకం కింద 11 లక్షల లబ్ధిదారులకు 180 కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది.
4) భవణా నిర్మాణ కార్మికులకు 9 లక్షల మందికి 1500/ చొప్పున 127 కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది.
5)వృద్ధాప్య పింఛన్లు కింద 1000/ చొప్పున 4,78000 మందికి 48 కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది.
6) వికలాంగ పెన్షన్లు కింద 24000 మందికి 2.5 కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది.
7)వితంతు పెన్షన్లు కింద 180000 మందికి 18 కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది.
8) మహాత్మా గాంధి జాతీయ ఉపాధి హామీ పథకం కింద 50,20,466 మందికి రోజుకు 20/ చొప్పున అదనంగా 100 రోజులకీ మొత్తంగా ఒక వ్యక్తికి 2000 చొప్పున 1004/ కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది.
9) జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా 1.90 కోట్ల కార్డు లబ్ధిదారులకు అయిన ఖర్చు బియ్యానికి 1260 కోట్లు పప్పు కి 265 కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది.
10) రాష్ట్ర విపత్తు రిలీఫ్ ఫండ్ కింద వలస కార్మికులకు రేషన్ కార్డు లేని వాళ్ళకి భోజనం అందించడం కోసం 600 కోట్లు మంజూరు చెయ్యడం జరిగింది.
11)15 వ ఆర్థిక సంఘం నిధులు కింద మొదటి విడతగా 982 కోట్లు ముందుగానే మంజూరు చెయ్యడం జరిగింది.
12) ఇవే కాకుండా covid19 ఆస్పత్రి మరియు ఆరోగ్య రక్షణ కింద నిధులు మంజూరు చెయ్యడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here