ప్రభుత్వం రైతుకు చేసింది ఏమి లేదు -కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు

0
186

తాజా కబురు కథలాపూర్ రూరల్ : మండలంలోని దూలూర్,బొమ్మెన గ్రామాల్లో వరిధాన్య కొనుగోలు కేంద్రాలను గురువారం జగిత్యాల భాజపా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కొడిపెల్లి గోపాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం, రైతులకు చేసిందేమిటని అన్నారు. ముఖ్యంగా కాబోయే ముఖ్యమంత్రిగా చెప్పుకుంటున్న కేటీ రామారావు జిల్లాలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే. మిగతా జిల్లాల లోని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అవలంబిస్తున్న నియంతృత్వ పాలనను వీడి వెంటనే సంబంధిత అధికారులు, రైస్ మిల్ యాజమాన్యం యూనియన్ అసోసియేషన్ తో చర్చలు జరపాలని అన్నారు.కొన్నిచోట్ల మాత్రమే హమాలీ లు ఉన్నారని, మరికొన్ని చోట్ల హమాలీలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని, హమాలీలను వెంటనే ఏర్పాటు చేయాలని కిసాన్ మోర్చా తరుపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం చేస్తున్నానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here