ప్రధాని నరేంద్ర మోదీకి వేయి పోస్ట్ కార్డులు

0
146

రాయికల్ తాజా కబురు: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన రైతు చట్టాన్ని వివరిస్తూ రైతుల అభిప్రాయాన్ని తెలుపుతూ ఆదివారం రైతులు సంతోషంతో ప్రధాని నరేంద్ర మోదీకి ఒకే రోజు మండల వ్యాప్తంగా ఒక వేయి పోస్ట్ కార్డులు రాసి ఆనందం వ్యక్తం చేసారని బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు బొడగం మోహన్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో టెలికం మెంబర్ గజేంగి అశోక్. బిజెవైఎం మండల అధ్యక్షులు కల్లెడ ధర్మపురి, భుత్ కమిటీ అధ్యక్షులు కుంబోజి రవి,తోకలు శంకర్,బన్నసంజీవ్,బొడ్గం శ్రీకాంత్ రెడ్డి,మహేందర్ నాయక్,కొట్టురి రమేష్ రైతులు పాల్గొన్నారు.

రామాజిపేట్ లో…
నూతన వ్యవసాయ చట్టానికి మద్దతుగా ఆదివారం రామాజిపెట్ గ్రామంలో ఎంపీటీసీ ఆకుల మహేష్ ఆధ్వర్యంలో రైతులు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ కార్డులు రాసి పోస్ట్ చేసారు.ఈ సందర్బంగా ఎంపీటీసీ మాట్లాడుతూ దలారీ,దోపిడీ, పన్నులు, కమీషన్ల నుoడి రైతులను కాపాడే ఈ బిల్లు తెచ్చిన ప్రధానిగా రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, ఈ చట్టం పై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ భాజపా అధ్యక్షులు జితేoధర్, బూత్ అధ్యక్షులు,కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

భూపతిపూర్ లో…
కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టం గురించి భూపతిపూర్ గ్రామంలో భాజపా గ్రామ అధ్యక్షులు సంకోజి శేఖర్ ఆధ్వర్యంలో రైతులు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ కార్డులు రాసి పోస్ట్ చేసారు.ఈ చట్టం గురించి ఆయన రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో,ప్రా.వ్య.స.సంఘం ఛైర్మెన్ ఏనుగు ముత్యం రెడ్డి,ఉపసర్పంచ్ అన్నవేణి వేణు,వార్డ్ సభ్యులు రాజశేఖర్ రెడ్డి, బొల్లే మహేష్,నాయకులుమంగలరపులక్ష్మీనారాయణ,శివ,విక్రమ్,రఘునందం,రాజేంద్రప్రసాద్, అంజయ్య రెడ్డి, ప్రవీణ్, శేఖర్, రవి, తిరుపతి, రంజిత్,జలందర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here