ప్రతి పల్లె అభివృద్ధి చెందుతుంది- జెడ్పీచైర్ పర్సన్ దావ వసంత

0
38

జగిత్యాల ఫిబ్రవరి 26, తాజా కబురు: జగిత్యాల రూరల్ మండలంలోని ఒడ్డెర కాలనీ నూతన గ్రామ పంచాయతీ భవనానికి శుక్రవారం జగిత్యాల శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ దావ వసంతసురేశ్ భూమి పూజ నిర్వహించారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్ పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తె.రా.స పార్టీ రోజు రోజుకు బల పడుతుందని, ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ప్రతి పల్లె అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు.‌ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here