ప్రతి కేసులో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ సమగ్ర విచారణ చేపట్టాలి :ఎస్పీ రాహుల్ హెగ్డే ఐపీఎస్

0
49

-పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ

-డయల్ 100 కాల్స్ పట్ల వేగవంతంగా స్పందించాలి:

రాజన్నసిరిసిల్ల తాజా కబురు ప్రతినిధి:ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లా పోలీసు అధికారులతో నెల వారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సం దర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసు లలోని వివరాలన్నింటినీ ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని సూచించారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరి ష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రతి ఒక్క రూ బాధ్యతగా కృషి చేయాలని కోరారు.నేరస్తులకు శిక్షలు పడే విధంగా చేసి శిక్షా రేటును పెంచా లని తెలియజేసారు.సిబ్బంది సెల వులను మరియు ఇతర అర్జీలను ఆన్లైన్ ద్వారా పొందే విధంగా అధి కారులందరూ వారికి హెచ్ ఆర్ ఎం ఎస్ పై అవగాహన కల్పించా లని తెలియజేసారు.ఈ-పెట్టీ కేసులు మరియు ఈ-చలనా ద్వారా రోడ్డు భద్రతా నియమాలను అతిక్రమించిన వారిపై జరిమానా లు విధించాలని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు లు నమోదు చేసి,పట్టుబడిన వ్యక్తు ల యొక్క లైసెన్సులను రద్దు చే యించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరాలను అ దుపు చేసే విధంగా పనిచేయాలని తెలిపారు.శాంతిభద్రతల పరిరక్షణ లో పోలీస్ అధికారులు రాజీ పడ వద్దని సూచించారు.గుట్కా మట్కా మరియు ఇతర అసాంఘిక కార్యక లాపాలకు పాల్పడేవారిపై నిరంత రం నిఘా ఏర్పాటు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూ చించారు.వివిధ సమస్యలతో పోలీ స్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మ ర్యాదగా ప్రవర్తిస్తూ,పోలీసులపై మ రింత నమ్మకాన్ని పెంపొందించేలా బాధ్యతగా పనిచేయాలని కోరారు. పోలీస్స్టేషన్ పరిసరాలను పరి శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపా రు.దొంగతనాల కేసుల్లో నిందితు లను పట్టుకొని చోరీ సొత్తును రిక వరీ చేసి బాధితులకు న్యాయం చేకూరే విధంగా పోలీసు శాఖలో ఉన్న సాంకేతికతను వినియోగిం చుకోవాలని సూచించారు.మహి ళల రక్షణకై ఏర్పాటు చేసిన షీ టీం ఆవశ్యకతను గురించి అవగాహనా కార్యక్రమాల్ని ఏర్పాటు చేయాలని తెలిపారు.సైబర్ క్రైమ్స్ బారినప డకుండా జిల్లా ప్రజలందరూ అప్ర మత్తంగా ఉండాలని తెలిపారు. ప్రతి పోలీస్టేషన్ పరిదిలో ప్రతి గ్రామంలో సి.సి.కెమెరాల ఏర్పాటు కు ప్రజలలో చైతన్యం పెంపొందిం చేందుకు కళా బృందం కార్యక్రా మాల ద్వారా సి.సి కెమెరాల ప్రా ముఖ్యత ప్రజలకు తెలియజేయా లని వాటిని అమర్చుటకు కృషి చే యాలని,సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలు తగ్గడ మే కాకుండా కేసులను ఛేదించడం లో ప్రముఖ పాత్ర వహిస్తాయని చె ప్పారు.మహిళల భద్రత కొరకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, పొక్సో కేసులలో విచారణ వేగవం తం చేయాలని,పోలీసు కళాబృం దం,షీ టీమ్స్ ద్వారా ప్రజలకు,వి ద్యార్థులకు,విస్తృతంగాఅవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,అ త్యవసర సమయంలో ప్రజలు వినియోగించే డయల్ 100 కాల్స్ పట్ల వేగవంతం అయినా స్పందన తప్పక ఇవ్వాలని,తక్కువ సమ యo లో సంఘటన ప్రదేశానికి బ్లూ కోల్ట్స్ లేదా పెట్రో కార్స్ ద్వారా చేరి సేవలు అందించాలని అధికా రులకు సూచించారు.
13 మంది పోలీస్ లకు అవార్డులు గత నెలలో ఉత్తమ ప్రతిభ కనబరి చిన పోలీస్ అధికారులకు కీ పెర్ఫా ర్మన్స్ ఇండికేట్ అవార్డులు ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ సందర్భంగా అందజేశారు.జిల్లా పోలీస్ కార్యా లయంలో లో ప్రత్యేకంగా అభినదిం చారు.అవార్డులను అందుకున్న వా రిలో అభిలాష్ ఎస్.ఐ ఆఫ్ పోలీ స్,శిరీష (రిసెప్షనిస్టు) తంగలపల్లి పోలీస్ స్టేషన్,రాజు ( రైటర్) వేము లవాడ రూరల్ పోలీస్ స్టేషన్ కమలేష్ ( బ్లూ కోల్ట్స్) వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్,శివ ప్రసాద్ (కోర్ట్ డ్యూటీ ఆఫీసర్) ఎల్లారెడ్డి పేట్ పోలీస్ స్టేషన్,సురేష్ (వారెంట్ అండ్ సమన్స్) ఇల్లంతకుంట పోలీ స్ స్టేషన్, శ్రీనివాస్(టెక్ టీమ్)వేము లవాడ రూరల్ పోలీస్ స్టేషన్,రవి (క్రైమ్ స్టాఫ్) వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్ ( జనరల్ డ్యూటీ ఆఫీసర్) తం గలపల్లి పోలీస్ స్టేషన్,సంతోష్ ఏ.ఎస్.ఐ (ప్రింగర్ ప్రింట్) రాజన్న సిరిసిల్ల,రామచంద్రమ్ (డి. పి.ఓ) వెంకట రమణ (ఐ. టి కోర్),రాజేష్ (ఐ.టి కోర్),ఈ సమావేశంలో డిఎస్పీ చంద్రకాంత్ సి.ఐ లు వెంకటేష్,బన్సీలాల్,శ్రీలత,రవికుమార్,ఆర్.ఐ లు రజినీకాంత్, కుమారస్వామి,ఎస్.ఐ లు ఐ.టి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here