ప్రతి కార్యకర్తకు అండగా తెలంగాణ ప్రభుత్వం-ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 

0
24
tajakaburu
ప్రతి కార్యకర్తకు అండగా తెలంగాణ ప్రభుత్వం-ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

 

tajakaburu
tajakaburu

తాజా కబురు జగిత్యాల: రాయికల్ మండలంలోని రైతులతో పాటు టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమున్న ప్రతికార్యకర్తకు ప్రమాదభీమా ద్వారా రెండు లక్షల ఇన్సూరెన్స్ అందించి అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్  మండలంలోని కుర్మపల్లి,తాట్లవాయి గ్రామాలలో ప్రమాదవశాత్తు మరణించిన ఇద్దరు టీఆర్ ఎస్ కార్యకర్తలు మ్యాకల మల్లవ్వ,గడ్డం శ్రీనివాస్ కుటుంబసభ్యులను కలిసిన ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రమాదభీమా ద్వారా మంజూరైన రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కులను స్వయంగా అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే రైతులకు ప్రమాదభీమా ఇస్తున్న ప్రభుత్వం టీఆర్ ఎస్ ప్రభుత్వమని,అంతేకాకుండా సభ్యత్వముండి ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తలకు సైతం రెండు లక్షల చొప్పున ప్రమాదభీమా ఇస్తున్న ఘనత కూడ టీఆర్ ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు ఎమ్మెల్యే.ప్రతి సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం 11 కోట్లు ఎల్ ఐసీ సంస్దకు చెల్లిస్తోందని,ఒక్క నియోజకవర్గంలోనే ఇప్పటికి ఏడుగురు కార్యకర్తలకు ఒక్కొ కుటుంబానికి రెండు లక్షల చొప్పున అందజేశామని వారి కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా ఉంటుందని అన్నారు.టీఆర్ఎస్ పార్టీకి 60 లక్షల మంది కార్యకర్తలు సభ్యత్వం పొందారని,ఇందులో క్రియాశీలక కార్యకర్తలు 20 లక్షలున్నారని అన్నారు.త్వరలో ప్రారంభంకానున్న సభ్యత్వంలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలోఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేందర్ నాయక్,మున్సిపల్ చైర్మన్ మోర హనుమాండ్లు, పార్టీ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు కోల శ్రీనివాస్, తలారి రాజేష్,కుర్మపల్లి సర్పంచ్ సుమలత,తాట్లవాయి సర్పంచ్ రాగి సాగారిక శ్రీనివాస్, ఉప సర్పంచ్లు మల్లేశం, వెంకటేష్ గౌడ్ ,సర్పంచ్ లు శ్రీనివాస్ గౌడ్,రవి గౌడ్,అల్లిపూర్ సింగిల్విండో చైర్మన్ రాజలింగం,నాయకులు,కంది రంజిత్,మరిపెళ్లి శ్రీనివాస్ గౌడ్,వెంకటేశ్వరరావు,అనుమల్ల మహేష్, ఉత్కం సాయగౌడ్ రాజమల్లు,మోర వెంకటేష్,మొకీద్,రత్నాకర్ రావు,బాలే చంద్ర శేఖర్,రామచందర్ రావు,రాజేందర్,సురేష్,రాజేశం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here