ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన

0
94

తాజా కబురు మెట్పల్లి: మండలం లోని ఆత్మ నగర్ గ్రామంలో గురువారం ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ అతిసార, శ్వాస కోస వంటి వ్యాధులతో ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా అనేకమంది పిల్లలు చనిపోతున్నారని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడమే దీనికి కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందని అన్నారు. ఈ నేపథ్యంలో 2008లో ఐక్యరాజ్య సమితి అక్టోబరు 15న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవంగా ప్రకటించినందంన ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ చేతులను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మన చేతుల్లో మన ఆరోగ్యం ఉంటుందని కరోనా ను అరికట్టవచ్చని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్లు విజయ, రఘుపతి రెడ్డి,ఉప సర్పంచ్ విజయ్, ఎంపీటీసీ రజిత, పంచాయతీ కార్యదర్శి మమత, ఐకెపి వివో రేఖ, వివోఎ ప్రభ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేందర్, వార్డు సభ్యులు,కరోబర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here