ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి మాస్కుల పంపిణీ -రైతన్న శ్రేయస్సే ప్రతిమ సంస్థ ద్యేయం

0
283

తాజా కబురు రాయికల్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కట్టడికి రైతులకు, కూలీలకు, నిరుపేదలకు ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోటి మాస్కుల పంపిణీలో భాగంగా బుధవారం రాయికల్ మండలంలోని అల్లీపూర్, అయోధ్య ,ఇటిక్యాల గ్రామాలలో ప్రతిమ ఫౌండేషన్ మండల ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి మాస్కులను పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలకు, నిరుపేద కూలీలకు మొదటి విడతగా ఆయా గ్రామాల సర్పంచుల సహాకారంతో మాస్కులను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రోజు రోజుకీ కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రమేష్, ఎం.పి.ఓ శ్రీనివాస్, ప్రతిమా ఆసుపత్రి మార్కెటింగ్ అసిస్టెంట్ మేనేజర్ ఎస్.రాజేంధర్, ప్రతినిధి సంతోష్, ఆయా గ్రామాల సర్పంచులు అత్తినేని గంగారెడ్డి, సామల్ల లావణ్య ,ఎడమల జీవన్ రెడ్డి, అల్లీపూర్ ఎం.పి.టి.సి సభ్యురాలు మోర విజయలక్ష్మి ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here