ప్రణాళిక బద్దంగా పట్టణ ప్రగతి నిర్వహించాలి: జగిత్యాల జిల్లా కలెక్టర్ జి.రవి

0
16

తాజా కబురు జగిత్యాల:పట్టణ ప్రగతి పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రవి అన్నారు.గురువారం మెట్పల్లి పట్టణ శివారులోని జాతీయ రహదారిపై పట్టణ ప్రగతి పనులను ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటారు అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులందరూ మంచి ప్రణాళికతో ముందుకు సాగాలని అన్నారు.రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలన్నారు.గృహిణులకు అవసరమైన పూలు,పండ్ల మొక్కలను అందించాలన్నారు. సిసి రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా కరెంటు లైన్ లేనిచో పరిష్కరించి ఇండ్లపై కరెంటు వైర్లు తదితర సమస్యలు పరిష్కరించాలని ఖాలీ ఫ్లాట్లలో పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టాలని,అవసరం అయితే ఫ్లాట్ల యజమానులకు నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 6,11,12వ వార్డు లలో జరుగుతున్న పట్టణ ప్రగతి మూడో విడత పనులను ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తో పాటు,మున్సిపల్ చైర్మన్ రణవేణి సుజాత, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహసిల్దార్ రాజేష్,ఎంపీపీ మారు సాయి రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ బోయిన్పల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్లు కొమిరెడ్డి జ్యోతి, బంగారుకాళ్ల కిషోర్, అంగడి పురుషోత్తం,మన్నే ఖాన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here