ప్రజాస్వామ్య విలువల అణిచివేత రోజు… ఎమర్జెన్సీ

0
30
tajakaburu
tajakaburu
  • ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పాక సత్యనారాయణ , బిజెపి జిల్లా అధ్యక్షుడు
    గంగాడి కృష్ణారెడ్డి..

భారత దేశంలో ప్రజాస్వామ్య విలువలను అణచివేసి ,దేశాన్ని అంధకారంలోకి నెట్టిన రోజు ఎమర్జెన్సీ అని, ఎమర్జెన్సీ దుర్మార్గానికి 46 ఏళ్లు గడిచిందని ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పాక సత్యనారాయణ మరియు బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి అన్నారు. ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని బిజెపి జిల్లా శాఖ ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ జిల్లా కన్వీనర్, కార్పొరేటర్ పెద్దపెల్లి జితేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం కరీంనగర్లోని టిఎన్జీవో ఫంక్షన్ హాల్ లో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవ సదస్సు నిర్వహించారు. ఇట్టి సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన వారు మాట్లాడుతూభారతదేశంలో ఎమర్జెన్సీ విధింపు దేశానికి చీకటి రోజు లాంటిదని, ప్రజాస్వామ్య విలువల పై కర్కశంగా దాడిచేసి, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఆనాటి కాంగ్రెస్ ఇందిరాగాంధీ నిరంకుశ పాలన విధానాలతో వారసత్వ రాజకీయాలకోసం చీకటి అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని విమర్శించారు. పత్రికలు, ప్రజా సంఘాలు, ప్రశ్నించే గొంతు లపై దేశవ్యాప్తంగా ఆంక్షలు విధించి, లక్షలాదిమంది ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమ కారులను అరెస్టు చేసి, యదేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి పాల్పడిన తీరుతో కాంగ్రెస్ ఇందిరాగాంధీ నైజం బయట ప్రపంచానికి బహిర్గతమైందన్నారు. ఎమర్జెన్సీ సమయం లో 21 నెలలు న్యాయవ్యవస్థ, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాంగ్రెస్ పార్టీ ఇందిరా ప్రభుత్వం తుంగలో తొక్కి దేశంలో ప్రజాస్వామ్యం వ్యవస్థను దారుణంగా నాశనం చేశారని దుయ్యబట్టారు. దేశాన్ని దేశంలోని వ్యవస్థలను తమ రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ నాశనం చేయడానికి ఎన్నో కుట్రలు చేసిందని అందుకు తగిన ప్రతిఫలం నేడు ఆ పార్టీ అనుభవిస్తూందని ఎద్దేవా చేశారు. నాడు ఆంగ్లేయుల బానిసత్వం నుండి విముక్తి పొందిన భారతదేశం కాంగ్రెస్ ఇందిరమ్మ నియంతృత్వంలో చిక్కుకొని అవినీతి అక్రమాలతో దేశంలో చెలరేగి పోయిందన్నారు. నియంతృత్వ పోకడలతో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ తమకు ఎదురు లేదని విర్రవీగి దేశంలో ఎమర్జెన్సీ విధిస్తే దేశమంతా నిశ్శబ్ద విప్లవం లో, సత్యాగ్రహ దళాల కదలిక తో కాంగ్రెస్ నిండా మునిగి పరిస్థితులు దేశంలో వచ్చాయన్నారు. ఎమర్జెన్సీ సమయంలో లక్షలాదిమంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి జైళ్లలో ఉండి, దేశంలో ప్రజాస్వామ్య రక్షణకుకృషి చేశారని తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో కమ్యూనిస్టు పార్టీలు మొక్కుబడిగా ఖండించాయి తప్ప, వ్యతిరేకంగా పోరాటం చేయలేదని దీంతో కమ్యూనిస్టుల బండారం కూడా బయటికి వచ్చిందన్నారు. నాటి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన త్యాగధనుల ను ప్రతి ఒక్కరూ స్మరించు కో వాలని,వారి స్ఫూర్తి ఆశయాలతో నే నేడుదేశంలో భారతీయ జనతా పార్టీ పరిపాలన కొనసాగిస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం , దేశం కోసం ఆలోచన చేసిన ఎందరో మహనీయుల స్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం,ప్రధాని నరేంద్ర మోడీ దిశానిర్దేశనం లోభారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడుతూ దేశం విశ్వ గురువుగా రూపాంతరం చెందే ప్రయత్నాల్లో ఉందన్నారు. అనంతరం బిజెపి సీనియర్ నాయకులు కోమల ఆంజనేయులు, పలక రాజిరెడ్డి లతో తో పాటు పలువురు వక్తలు తదితరులు ప్రసంగించారు. అనంతరం ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆనాటి కరీంనగర్ జిల్లా పోరాటయోధు లను పలువురిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో కళ్లెపు సుధాకర్ రావు నవనీత్ రావు ,కోమల ఆంజినేయులు ,కసిరెడ్డి సంజీవ్ రెడ్డి ,పరశురామ్ జి, జొన్నల హనుమంత రెడ్డి , పలకల రాజ్ రెడ్డి కొమరవళి సదానందం నరహరి లక్ష్మారెడ్డి బిజెపి నాయకులు బేతి మహేందర్ రెడ్డి ,బత్తుల లక్ష్మీనారాయణ, కళ్లెం వాసుదేవ రెడ్డి , వై ద రామానుజనo, దురిశెట్టి సంపత్ , జమాల్ అహ్మద్, బొంతల కళ్యాణ్ చంద్ర, కటకం లోకేష్, బండ రమణారెడ్డి, దూలం కళ్యాణ్, జాడీ బాల్ రెడ్డి, బల్వీర్ సింగ్, బండారు గాయత్రి , శ్రవణ్ కుమార్, కార్పొరేటర్ అనుప్,రవి, మాడిశెట్టి సంతోష్, జగదీశ్వరా చారి, మహిళా మోర్చా నాయకురాలు మామిడాల చైతన్య శిల్పా వేదం లావణ్య తదితరులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here