పౌష్టికాహారంతో పరిపూర్ణ ఆరోగ్యం,ఐసీడీఎస్ సూపర్ వైజర్ ప్రేమలత

0
14

తాజాకబురు కోరుట్ల: గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు గుడ్లు, పాలు, పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందించి పరిపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని కోరుట్ల ఐసీడీఎస్ సూపర్ వైజర్ ప్రేమలత అన్నారు. గురువారం కోరుట్ల పట్టణంలోని రహమత్ పుర-2 అంగన్ వాడి కేంద్రంలో టీచర్ చింత అరుణ ఆధ్వర్యంలో జాతీయ పోషకాహార దినోత్సవం నిర్వహించారు. పోషకాలతో కూడిన ఆహారాన్ని గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు అందించి బరువు, ఎత్తును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్ వైజర్ ప్రేమలత, అంగన్ వాడి టీచర్ చింత అరుణ, ఆయా చాంద్ సుల్తానా, బాలింతలు, గర్భిణీలు, పిల్లలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here