పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు అభినందనీయం.
కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచన.
తాజా కబురు జగిత్యాల: శాంతి భద్రతల పరిరక్షణతో పాటు బాధితులకు న్యాయం అందించే అవకాశం ఒక్క పోలీస్ ఉద్యోగం ద్వారానే సాధ్యమని అలాంటి పోలీస్ శాఖలో ఉద్యోగం లభించడం చాలా గొప్ప అవకాశమని డీఎస్పీ వెంకటరమణ అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పదవీ విరమణ పొందిన పీసీఆర్ ఎస్.ఐ అభిదుల్లా రహీమ్ VR లో ఉన్నఎస్.ఐ.MD. షఫీయుద్దీన్, రాయికల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ASI చంద్రశేఖర్, జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ASI గంగారాంలను శాలువా,పూలమలతో సత్కరించి వారందించిన సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన అధికారులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ సంతోషంగా ఉండాలని సూచించారు. ఏ రంగంలోనైనా కష్టపడి పని చేసినప్పుడే అందుకు తగిన గుర్తింపుతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకోగలమన్నారు. ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు. పోలీస్ వృత్తి ద్వారా న్యాయం కోసం ఎదురు చూసే బాధితులకు అండగా నిలిచే అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అయితే ఉద్యోగ విరమణ తర్వాత ఖాళీగా ఉండకుండా ఏదో ఒక వ్యాపకంతో సమాజాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణలో ఎక్కువ శ్రద్ధ వహిస్తూ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలన్నారు.ఈ కార్యక్రమంలో SB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,DPO సూపరిండెంట్ శ్రీనివాస్,R I సైదులు, SB ఎస్.ఐ ఉపేంద్ర చారి,పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.