పోరుమల్ల లో జోరుగా బెల్టు దుకాణాలు… చోద్యం చూస్తున్న అధికారులు

0
595

పోరుమల్ల గ్రామంలోని బెల్ట్ షాప్ వద్ద ఇళ్ళ మధ్యలో బహిరంగంగా మధ్యం సేవిస్తున్న మందు బాబులు
బెల్ట్ పై నో స్పెషల్ డ్రైవ్..
మేడిపల్లి తాజా కబురు క్రైం: మండలంలోని పోరుమల్ల గ్రామంలో వాడ వాడలో బెల్టు దుకాణాలు ఉన్న అధికారులు మాత్రం ఆ గ్రామం వైపు చూడక పోవడంతో నెల వారి మామూళ్ల తీసుకుంటూ బెల్టు దుకాణాల దందాకు అధికారులు అండగా ఉంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత నెలలో జిల్లా ఇంచార్జి ఎస్పీ కమలాసన్ రెడ్డి అక్రమ కార్యకలాపాల పై పోలీసులు ఉక్కు పాదం మోపాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ మేడిపల్లి మండలం లో మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోవడం లేదని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. పోరుమల్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం డయల్ 100 కు కాల్ చేసి బెల్టు షాప్ వల్ల తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పినప్పటికీ సంఘటన స్థలానికి రాకుండానే స్థానిక పోలీసు స్టేషన్ కు వచ్చి పిర్యాదు చేయాలనీ బాధితులకు ఓ కానిస్టేబుల్ ఫోన్ ద్వారా తెలిపారని,ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వెలితే ఫిర్యాదు నమోదు చేయాల్సిన పోలీసులు పెద్దసారు లేరని వచ్చే దాక ఆగాలని చెప్పడం, తీరా సారు వచ్చినాక ఫిర్యాదు తీసుకొని రసీదు ఇవ్వమంటే కంప్యూటర్ పని చేస్తలేదని తెల్పడం పోలీసుల నిర్లక్ష వైఖరికి అద్దం పడుతుందని సదరు బాధితులు ఆవేదన వ్యక్తం చేసారు. ఏది ఏమైనా ఆ గ్రామంలో బెల్టు షాప్ ల దందా యథేచ్ఛగా కొనసాగుతున్న అటు ఎక్షైజ్ శాఖ అధికారులు ఇటు పోలీసులు స్పందించక పోవడంతో అధికారులు మామూళ్ళు తీసుకుంటూ అక్రమ దందాలకు అండగా ఉంటున్నారనే ఆరోపణలకు బలం చేకూరుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here