పైడిమడుగు గ్రామానికి “మూడో కన్నులేదు”-తరచు దొంగతనాలు, రోడు ప్రమాదాలు..

0
486

పైడిమడుగు లో ప్రాణాలు మింగేస్తున్న మిషన్ భగీరథ గుంతలు…

తాజాకబురు సెట్రల్ డెస్క్ :పేరుగొప్ప ఊరుదిబ్బ అన్నట్లు, చెప్పుకోవటానికి ఆ గ్రామం చాలా పెద్దది,ఆ గ్రామంలో ఉన్న గొప్పతనాలు కూడా చాలా గొప్పవి,ఆసియా ఖండంలోనే అతిపెద్ద విస్తరణ కలిగిన మర్రి చెట్టు,గ్రామంలో ప్రకృతి రమణీయతకు అద్దం పట్టె వెంకటేశ్వర ఆలయం,ఈ గ్రామం నుండి అటెండర్ నుండి గొప్ప ఉద్యోగాలు చేస్తున్నవారు,ఇలా చెప్పుకుంటూ వెళితే ఆ గ్రామం అన్నీంట్లో ఆమోదయోగ్యమే కానీ ప్రజాప్రతినిధుల పాలన మాత్రం అటకెక్కింది, గ్రామంలో మిషన్ భగీరథ తవ్వకాలు చేపట్టడం వల్ల నడి రోడ్డు పై గుంతలు ఏర్పడ్డాయి దీంతో రాత్రివేళల్లో వాహనచోదకులు గుంతలు గమనించకుండా అందులో పడడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యాడు, దీంతోపాటు గడిచిన సంవత్సరంలో దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయి, అయినా చర్యలు శూన్యం..

ప్రమాదాలు… మరణాలు

పైడిమడుగు గ్రామంలో దారిపొడవునా మిషన్ భగీరథ పైపుల కోసం తగిన తవ్వకాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, గుంతలు ఏర్పడకపోవడం వల్ల వాహనచోదకులు అదుపు తప్పి పడి గాయాల పాలవుతున్నారు కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తున్నాయి.ఇదె క్రమంలో అభం శుభం తెలియని పిల్లలు రోడు ప్రమాదంలో మరణిస్తున్నారు,బుధవారం జరిగిన రోడు ప్రమాదంలో రోహిత్ మ్రుతి చెందగా మరో బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి..గతంలో కూడా ఈ గ్రామంలో రోడు ప్రమాదాలు జరిగాయి అలాగె రైతుల కరెంటు మోటార్లు దొంగలు ఎత్తుకెళ్లారు ,ఒకవేళ సీసీ కెమారాలు పని చేసి ఉంటె ప్రమాదాలను అరికట్టె అవకాశం ఉండేది..

సీసీ కెమెరా పని చెయ్యవూ…

ఈ గ్రామం మలుపులతో ఉంటుంది ,విస్తీర్ణం కూడా పెద్దగా ఉంటుంది ,కోరుట్ల మండలంలోని అయిలాపూర్ తర్వాత అతి పెద్ద గ్రామం అంటే పైడిమడుగు అని చెబుతుంటారు .కానీ ఇక్కడ ప్రజా ప్రతినిధుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది, గడిచిన సంవత్సరకాలంలో గ్రామంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ,రైతులు పంట సాగు చేసేందుకు పెట్టుకున్న కరెంటు మోటార్లు తరచూ దొంగతనానికి గురయ్యాయి, దీంతో పోలీసులు దర్యాప్తు చేసి దొంగను పట్టుకున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా గ్రామంలో సిసి కెమెరాలు లేకపోవడం వల్ల గ్రామంలో జరుగుతున్న సంఘటనల వల్ల అటు ప్రజలు,ఇటు పోలీసులు సైతం ఇబ్బంది పడుతున్నారు…

రోడు ప్రమాదాలు…

పైడిమడుగు గ్రామంలో గడిచిన సంవత్సరకాలంలో అతిగా రవాణా జరుగుతున్న ఇసుక ట్రాక్టర్లు, దొంగతనాలు ,రోడ్డు ప్రమాదాలు జరిగి తీవ్ర నష్టం జరిగింది, ఒకవేళ సీసీ కెమెరాలు ఉండి ఉంటే జరిగిన సంఘటన తొందరగా చేధించె అవకాశం ఉండేది, కానీ సీసీ కెమెరాలు పని చెయ్యకపోవటంతో గ్రామం నుండి వెళ్లే ఇసుక ట్రాక్టర్ల నుండి,అక్రమ కలప,అలాగే మరేన్నో రవాణా అవుతున్నాయి…

రోడు ప్రమాదంలో మ్రుతి చెందిన ఆడేపు రోహిత్……..

ఆసియా ఖండంలోనే అతి పెద్ద మర్రి,కానీ ఏం జరిగిన తెలియదు మరీ..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మర్రిచెట్టు గా పైడిమడుగు గుర్తింపు పొందింది ఐదు ఎకరాల విస్తీర్ణం పర్యాటకులను ఆకర్షిస్తుంది, ప్రతి శుక్రవారం మఱ్ఱి చెట్టు కింద ఎంతోమంది తమ మొక్కులు చెల్లించుకుంటారు దీంతోపాటు మరి వద్ద ఉన్న ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు, ఇంత ప్రాముఖ్యత సంతరించుకున్న మర్రిచెట్టు వద్ద ఆరునెలల క్రితం వరకు సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆలయంలోకి ప్రవేశించి దొంగలు అమ్మవారి ఆభరణాలు ఎత్తుకెళ్లారు, ఇంత జరిగినా గ్రామంలోని ప్రజాప్రతినిధులు మాత్రం సిసి కెమెరాల మరమ్మతుల పట్ల ఎలాంటి చర్యలు తీసుకోలేదు… ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో లో గత ఐదు సంవత్సరాలుగా భక్తుల మరి వద్ద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా సీసీ కెమెరాలు కూడా అమర్చారు, రెండు సంవత్సరాల పాటు సజావుగా సాగినా సాంకేతిక లోపంతో సీసీ కెమెరాలు పని చేయలేదు దీంతో ఆలయ కమిటీ గ్రామ కమిటీ సీసీ కెమెరాల మరమ్మతులు చేయించి ఉంటే దొంగతనాలు జరిగేది కాదు, పలుసార్లు ఎన్నారై సభ్యులు సీసీ కెమెరాలను మార్చిన కూడా మళ్లీ నీ పని చేయకుండా అయ్యాయి దీంతో రెండున్నర సంవత్సరాల పాటు సీసీ కెమెరాలు లేకుండా గడిచింది.

నూతన కమిటీ సీసీ కెమెరాలు..

మర్రి చెట్టు నూతన ఆలయ కమిటీ ని ఎన్నుకున్నారు,దీంతో ఆలయంలో సీసీ కెమెరాలను అమర్చారు,కానీ గ్రామంలో మాత్రం కెమెరా పని చెయ్యడం లేదు,తరచు గ్రామంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్న స్తానిక ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారంలో విఫలం అవుతున్నారు. గ్రామంలో యదేచ్చగా వివిధ ప్రాంతాలకు ఇసుక ట్రాక్టర్లు వందల సంఖ్యలో నడుస్తున్న వాటిపట్ల చర్యలు లేవు, అలాంటి ట్రాక్టర్ల వల్లనె నిన్న జరిగిన రోడు ప్రమాదంలో రోహిత్ మ్రుతి చెందగా మరో బాలుడు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నాడు..

పలుమార్లు పోలీసులు కౌన్షిలింగ్..సీసీ కెమారాలు ఏర్పాటు చేసుకోవాలని సూచన..

గ్రామంలో సంఘటనలు జరుగుతున్నాయని,అందుకు గ్రామంలో ప్రతి మూలమలుపు,అలాగె ప్రధాన రాస్తాల వద్ద సీసీ కెమరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా పోలిసులు స్తానిక ప్రజాప్రతినిధులకు తెలిపారు, 6 నెలల క్రితం కూడా రైతుల కరెంట్ మోటార్లు దొంగతనం జరిగినప్పుడు కూడా తెలిపారు, అయిన గ్రామ కమిటీ తీర్మాణం చేస్తామని తెలిపి పట్టించుకోలేదు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here