పైడిమడుగులో కరోనా బాధితులకు ఆవిరి యంత్రం,ఆయిర్వేద మందులు పంపిణీ చేసిన వార్డు సభ్యుడు..

0
134
tajakaburu
tajakaburu

జగిత్యాల జిల్లా,కోరుట్ల మండలం,పైడిమడుగు గ్రామంలో నిత్యం కరోనా పట్ల అవగాహాన కల్పిస్తున్నారు సర్పంచ్, అలాగె వార్డు సభ్యులు,గ్రామంలో కరోనా కేసులు పెరగకుండా ఉండెందకు కార్యాక్రమాలను నిర్వహిస్తున్నారు, గ్రామంలో ఇప్పటికి నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల ద్రుష్టిలో పెట్టుకుని గ్రామంలో హైపోక్లోరైడ్ రసాయన ద్రవణం పిచికారీ చేపిస్తున్నారు, అయితె కరోనా బారీన పడిన వాళ్లకు ముఖ్యంగా మనోదైర్యం నింపెందుకు గ్రామంలోని వార్డు సభ్యుడు కంటె లక్పతి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు,గ్రామంలో వైద్యపరీక్షలు నిర్వహించటంలో సర్పంచ్, యంపిటీసితో పాటు వార్డు సభ్యులు తమవంతు భాద్యత నిర్వర్తిస్తున్నారు.

గ్రామంలో కరోనా బారిన పడిన వాళ్లకు కంటె లక్పతి తన స్వంత ఖర్చుల తో…. స్టీమింగ్ మిషన్లు (ఆవిరి యంత్రం) తొపాటు రోగనిరోదక శక్తి పెంపొందించేందకు ఉపయోగపడె ఆయుర్వేద మందులు  జగదాంబ (పచ్చి పసుపు),మెంతల్ క్రిస్టల్ స్టోన్ (పుదీనా మొగ్గ),  కృష్ణ తులసి ఆకులు ఈ రోజు అందజేశారు, వాటిని ఎలా వాడాలో వారికి వివరించారు,ఆయన మాట్లాడుతూ… కరోనా వ్యాధి అనేది రూపాంతరం చెందుతూ వ్యాధి లక్షణాలు బయటకి కనపడకుండా ఉన్న వారిలో కూడా ఈ వ్యాధి రావడం మనం చూస్తూనే ఉన్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా తమ వంతుగా స్వచ్చంధం గా కరోనా టెస్ట్ చేయించుకొని,మన సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతయినా ఉందని అన్నారు,వైద్యం లో కూడా ఇంకా ప్రథమ దశలోనే ఉంది ఈ వ్యాధి అందరిలో ఒకే లక్షణం తో లేదు కావున ఇది కరోనా కాదేమో అనే భ్రమలో బయట తిరగడం వలన అందరికి వ్యాపిస్తుంది కావున ఏ కొంచెం అనారోగ్య లక్షణాలు ఉన్న కూడా ముందుగా కరోనా టెస్ట్ కూడా చేయించుకుంటే వ్యాధి ప్రబలకుండా అరికట్టవచ్చు…తగిన మోతాదులో వేసుకొని ఆవిరి పట్టుకోగలరు అని తెలియజేశాడు. వాటితో పాటుగా కోడిగుడ్లు,ఫ్రూట్స్ అందజేశాడు..ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్  ధమ్మా భీమారెడ్డి,TRS గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు దుంపల ప్రదీప్, అంబేడ్కర్ సంఘం ఉప అధ్యక్షుడు బత్తుల తిరుపతి తదితరులు పాల్గోన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here