పేదింటి ఆడబిడ్డకు ఆసరాగా కళ్యాణలక్ష్మి-ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

0
86

తాజా కబురు రాయికల్: మండల కేంద్రంలోని ఆర్.ఆర్. గార్డెన్ లో 160 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ 1 కోటి 57 లక్షల 95వేల328రూ.ల విలువైన కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డకు పెళ్లైన అనంతరం కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ ద్వారా ఒక లక్ష 16వేల రూపాయలను ఒక్కో ఆడబిడ్డకు దేశంలోనే కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అందిస్తున్నామని అన్నారు.సంక్షోభ సమయంలోను పేదలకు అందిస్తున్న రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉంటామని,ఒక్క జగిత్యాల జిల్లాలోనే ఇప్పటి వరకు వెయ్యి మంది రైతులు మరణిస్తే ఒక్కో కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు అందించిన ఘనత కేవలం తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు.కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ పరిస్దితుల్లో అన్ని వర్గాలు నష్టపోకుండా చూడటం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ మోర హన్మండ్లు,ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి,జడ్పీటీసీ అశ్విని జాదవ్,మార్కెట్ కమిటి చైర్మన్ గన్నె రాజిరెడ్డి,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,వైస్ ఎంపీపీ మహేశ్వర్ రావ్,వైస్ చైర్మన్ కొల్లూరి వేణు,పార్టీ మండలాధ్యక్షుడు కోల శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్,యూత్ అధ్యక్షుడు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here