పూలంగి సేవలో ధర్శనమిచ్చిన అమ్మవారు

0
101

జగిత్యాల తాజా కబురు:దుర్గామాత అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాల్గవ రోజు మంగళవారం పూలంగి సేవలో దుర్గామాత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరామ థియేటర్ సమీపంలో శ్రీజయదుర్గాదేవీ సమితి ఆధ్వర్యంలో నిర్వాహకులు నెలకొల్పిన దుర్గామాత తొమ్మిది రోజులు రోజుకో అవతారం చొప్పున దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తూన్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారికి రోజుకో విధంగా ప్రత్యేక అలంకరణలు చేస్తుండగా వేదబ్రాహ్మణోత్తములు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు దర్శనమిస్తున్నారు. మంటపాల వద్ద భవానీ దీక్ష పరులు అమ్మవారిని ఉదయత్ పూర్వమే కొలుస్తూ ఏకభుక్తం పాటిస్తూ నిష్టగా ఉండి భవానీ నామస్మరణ చేస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజులుగా అమ్మవారికి ప్రత్యేక పూజలు,అభిషేకాలు, మహిళలు కుంకుమ పూజలు చేస్తూ భక్తి భావాన్ని చాటుకుంటున్నారు. కార్యక్రమంలో ముసిపట్ల లక్ష్మి నారాయణ, విజయ్ దితరులు పాల్గొన్నారు. ‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here