పుట్టినరోజున రక్త దానం చేసిన ఉపాధ్యాయుడు

0
83
D-jithender-blood-donation-tajakaburu

జగిత్యాల తాజా కబురు: రాయికల్ మండలం మహితాపూర్ గ్రామానికి చెందిన డి. జితేంధర్ చెర్లకొండాపూర్ గ్రామంలో ని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. అందరు తమ పుట్టినరోజున ఓ మంచి పని చేయాలనే సంకల్పిస్తారు.కానీ ఆ సారూ మాత్రం ఈ పుట్టిన రోజునుండి ప్రతి 3 నెలల కొకసారి రక్త దానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆలోచన వచ్చిందే తనవుగా గురువారం జిల్లా కేంద్రంలోని ఓ రక్త నిధి కేంద్రానికి వెళ్లి స్వయంగా రక్త దానం చేసారు. ఈ సంధర్బంగా ఆయన తాజా కబురుతో మాట్లాడుతూ రక్త దానం చేయడం పై యువత అపోహలు విడిచి ముందుకు రావాలని కోరారు.
తాజా కబురు తరుపున రక్త దాతకు హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here