బోర్నపెల్లి లో ఓ వీధిలో నిలిచిన నీరు
రాయికల్ తాజా కబురు: మండలం లోని మైతాపూర్ గ్రామంలోని 1వ వార్డు లోని మురికి కాలువలు మిషన్ భగీరథ పైపు లైన్ తవ్వకాల్లో కూలిపోవడంతో సోమవారం రాత్రి కురిసిన వర్షానికి మురికి కాలువల నీరు వార్డులోని పలు వీధుల గుండా ప్రవహించడంతో దుర్వాసనతో పాటు మురికి నీరు ఇళ్లలోకి రావడంతో ప్రజలు ఇబ్బందులకు గురైనారు. బోర్నపెల్లి గ్రామంలోని ఓ వీధిలో నీరు నిలిచి పోవడంతో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి పల్లె ప్రగతిలో అభివృద్ధికి బాటలు వేసే ప్రణాళికలను అమలు చేయాలనీ స్థానిక ప్రజలు కోరుతున్నారు.