పరిశుభ్రతే ఆరోగ్యానికి “ఆయుధం “

0
107

రాయికల్ తాజా కబురు: ఏ పని చేయాలన్నా… వస్తువులను తాకాలన్నా ..అన్నం తినాలన్న చేతులతోనే చేస్తామని అలాంటి చేతులు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటామని పరిశుభ్రతే ఆరోగ్యానికి “ఆయుధం ” మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు పేర్కొన్నారు. గురువారం “అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత” దినోత్సవం సందర్భంగా మండలంలోని ఇటిక్యాల్ గ్రామంలో రాయికల్ లయన్స్ క్లబ్,యునిసెఫ్ స్వచ్ఛభారత్ ఆధ్వర్యంలో మహిళలకు చేతుల పరిశుభ్రత,అపరిశుభ్రత పై ప్రయోగాత్మకంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు ,జగిత్యాల జిల్లా స్వచ్ఛ్ భారత్ మిషన్ కన్సల్టెంట్ హరిణి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా వైరస్ నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి మనకున్న అతి పెద్ద ఆయుధం భౌతిక దూరం పాటింపు ,మాస్కులు ధరించడం ,వ్యక్తిగత పరిశుభ్రత ,సబ్బు శానిటైజర్లతో తరచూ చేతులను శుభ్రపరచుకోవడం ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు .దైనందిన జీవనంలో చేతుల శుభ్రత అత్యంత ముఖ్యమైందని ,చేతులు చూడ్డానికి అందంగా కనిపించిన చేతులపై లక్షల సూక్ష్మ జీవులు ఉంటాయన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు.తినేముందు,తిన్న తరువాత ,మలమూత్ర విసర్జన,వస్తువులను తాకినప్పుడు మనకు హాని చేసే సూక్ష్మజీవులు చేతులపై చేరుతాయని సబ్బుతో చేతులను 20సెకన్ల పాటు శుభ్రంగా కడుక్కోవాలన్నారు.చేతులు పరిశుభ్రంగా ఉంచుకుంటే 90శాతం రోగాలు దూరం అవుతాయని తెలిపారు.మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉందని చేతుల పరిశుభ్రతతోనే వ్యాధులు దరిచేరవని సూచించారు.లయన్స్ క్లబ్ అధ్యక్షులు కాటిపెల్లి రాంరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా సోకకుండా ప్రజలు శానిటైజర్ సబ్బుతో చేతులు శుభ్రం చేయడంతో హాస్పిటల్ కు పోవడం తగ్గిందని ప్రజలు చేతులు శుభ్రపరచుకోవడం దినచర్యలో భాగం కావాలన్నారు. అనంతరం రాయికల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 100మంది మహిళలకు , గ్రామస్తులకు చేతులు శుభ్రపరుచుకునే ద్రావణాన్ని పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు,ఎంపీటీసీ కొమ్ముల రాధ ఆదిరెడ్డి,సింగిల్విండో చైర్మన్ మహీపతి రెడ్డి,డాక్టర్ కృష్ణ చైతన్య ,జిల్లా యూనిసెఫ్ స్వచ్ఛంద సభ్యులు కడకుంట్ల అభయ్ రాజ్,శ్యామల,నీరజ,జిల్లా కో ఆర్డినేటర్ మ్యాకల రమేష్ , డి సి బత్తిని భూమయ్య,క్లబ్ సభ్యులు మారిపెళ్లి శ్రీనివాస్, బొడుగం అంజిరెడ్డి,శ్రీనివాస్, మచ్చ శేఖర్ ,దాసరి గంగాధర్, కడకుంట్ల నరేష్, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ చింతకుంట సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here