పరిమళించిన మానవత్వం

0
89

కోరుట్ల తాజా కబురు: పట్టణంలోని ముత్యాల వీధికి చెందిన తాటికొండ రాంనారాయణ కరోనా మహమ్మారి వ్యాధి బారిన పడి భాగ్యనగర్ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ గురువారం మరణించగా అతని మృత దేహాన్ని అంత్యక్రియలు చేసేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో సమాచారం తెలుసుకున్న విశ్వహిందూ పరిషత్ నాయకులు మంచాల జగన్,జిల్లా కార్యదర్శి గజం రాజు,సీనియర్ పాత్రికేయులు శికారి రామకృష్ణ,బీజేవైఎం నియోజకవర్గ కన్వీనర్ 31వ వార్డ్ కౌన్సిలర్ పెండెం గణేష్ లు హిందూ సాంప్రదాయ బద్దంగా అంత్యక్రియలు జరిపి మానవత్వం ఇంకా బతికిఉందని చాటి చెప్పారు. ఈ సందర్బంగా పెoడo గణేష్ మాట్లాడుతూ హిందూ సమాజంతో పాటు, ఇతర మతస్తులు ఎవరైనా కరోనా వ్యాధితో మరణిస్తే వారి అంత్యక్రియలు నిర్వహించడానికి మేమంతా ముందుటామని 9440152525 చరవాణి ద్వారా తమకు సమాచారం అందించాలని కోరారు. వీరితో పాటుగా ఏబీవీపీ నాయకులు రుద్ర విగ్నేష్ ఆర్మురి వినోద్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here